Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వైఫై ప్రాజెక్టులో భాగంగా యాక్ట్ పైబర్ నెట్ భాగస్వామ్యంతో‘డిజిటల్ తెలంగాణ’ను మరింత వేగవంతం చేసే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో బుధవారం 3,000 పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను ప్రారంభించింది.తెలంగాణ పరిశ్రమలు, సమాచార సాంకేతిక (IT) శాఖ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి గౌరవనీయులైనశ్రీ కె.టి.రామారావు,తెలంగాణ ఐటి, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శిశ్రీ జయేష్ రంజన్,అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బాలా మల్లాదితదితర ప్రముఖులు, ఇతర అధికారుల సమక్షంలో ఈ వైఫై హాట్ స్పాట్సేవలను ప్రారంభించారు.
కరోనామహమ్మారితర్వాత దేశ ప్రజలు డిజిటల్ ప్లాట్‌ఫారాలను వినియోగించడం బాగా పెరిగింది. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ డిమాండ్ పలు రెట్లు పెరగనుంది. Wi-fiహాట్స్పాట్ల ఏర్పాటు.. ఎక్కువ మంది కనెక్ట్ అయి ఉండేందుకు , ఇంటర్నెట్ సదుపాయాలను పొందేందుకు సరైన పరిష్కారంగా మారింది. వైఫై హాట్ స్పాట్స్ప్రారంభంతో భారతదేశంలో అతి పెద్ద స్థాయిలో పబ్లిక్ Wifiనెట్వర్క్ కలిగిన తొలినగరాల్లో హైదరాబాద్ఒకటిగా నిలిచింది. నగరంలోని 3,000 Wifi హాట్స్పాట్లలో ప్రతిదీ ACT SmartFiber™Technologyతో, సూపర్ ఫాస్ట్ మరియు సురక్షిత ఇంటర్నెట్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సాంకేతికత వినియోగదారులకు అనువైన, అడ్డంకులు లేని కనెక్టివిటీని వీడియో కంటెంట్లను అందిస్తుంది. ACT’s గిగాబిట్-సదుపాయం కలిగి ఉన్న నెట్వర్క్ ద్వారాకాల్స్ చేయడం, స్ట్రీమింగ్, అత్యంత వేగంగా ఫైల్స్‌ను ట్రాన్స్ఫర్ చేయడాన్ని సులభంగా చేయొచ్చు. SmartFiber™సాంకేతికత పెరగడంతో ఏప్రిల్ 2021లో ఇన్‌మొబి నిర్వహించిన అధ్యయనంలో హైదరాబాద్ అతి పెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అయింది. ACT హైదరాబాద్‌లో అత్యంత వేగవంతమైన సేవలను అందిస్తూ మరియు స్ట్రీమింగ్కు అత్యుత్తమ బ్రాండ్బ్యాండ్గా గుర్తింపు దక్కించుకుంది.
వినియోగదారులు ‘‘ACT Free Hy-Fi’’ పోర్టల్ ద్వారా తమ ఫోన్ నంబరుతో లాగిన్ కావచ్చు. 25 Mbps వేగంతో 45 నిమిషాల పాటు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. ఇంకా ఎక్కువ డేటాఅవసరం అయినప్పుడు టాప్ అప్ చేసుకోవచ్చు. ఇప్పటికేACT వినియోగదారులుగా ఉన్న వారు, తమ ACTవివరాలను పోర్టల్‌లో నమోదు చేసి లాగిన్ కావల్సి ఉంటుంది. వీరు తమ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వేగంతోనేహాట్ స్పాట్ నుంచీ ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు, ఒక వినియోగదారుడు తన ఇంట్లో 100 Mbps ప్లాన్‌ను వినియోగించుకుంటూ ఉంటే, Wifi హాట్‌స్పాట్‌లో అతను లాగిన్ అయినప్పుడు కూడా 100 Mbps వేగాన్ని అందుకుంటాడు. ఈ హాట్స్పాట్లు నగరవ్యాప్తంగా మాల్స్, ఆసుపత్రులు, పబ్లిక్ పార్కులు, మెట్రో స్టేషన్లు, ప్రభుత్వ గ్రంథాలయాలు, విద్యా సంస్థల్లో తేలికగా వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, సమాచారా సాంకేతిక (IT) శాఖ, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగౌరవనీయులైన శ్రీ కె.టి.రామారావు, మాట్లాడుతూ ‘‘పలు అధ్యయనాల్లో హైదరాబాద్ ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా గుర్తింపు దక్కించుకుంది. హైదరాబాద్‌లో ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న 3,000 హాట్స్పాట్లు ఇప్పుడు ఈ నగరాన్ని అసలు సిసలైన గ్లోబల్ స్మార్ట్ సిటీగా మార్చివేయనున్నాయి. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఉచిత ఇంటర్నెట్ను, ఉత్తమంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉండడం సంతోషాన్ని కలిగిస్తోంది. ACTFibernetపలు సంవత్సరాలుగా విశ్వసనీయమైన వ్యాపార భాగస్వామిగా ఉంటూ ఈ Wi-fiపథకాన్ని విస్తరించేందుకు మద్ధతు ఇస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఐటి, పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శిశ్రీ జయేష్ రంజన్మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ ఇప్పుడు అది పెద్ద ఉచిత పబ్లిక్ Wifi నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దాన్ని పలు పబ్లిక్ ప్రదేశాల నుంచి వినియోగించుకోవచ్చు. Wifiద్వారా హైదరాబాద్ నగరం మొత్తం ఇప్పుడు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందుకోవచ్చు మరియు డిజిటల్ ప్రపంచం అందించే అవకాశాలతో ప్రయోజనాన్ని పొందవచ్చు’’ అని వివరించారు. అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (ACT) సీఈఓ శ్రీ బాలా మల్లాదిమాట్లాడుతూ ‘‘ACTFibernetఎల్లప్పుడూశక్తిమంతమైనఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడంలోనమ్మకాన్ని ఉంచి, సామాజిక మార్పులను తీసుకు వచ్చేందుకు ప్రేరణ అందిస్తోంది.ఈఉచిత పబ్లిక్ Wi-fi విద్యార్థులు, ఆరోగ్య శాఖ కార్యకర్తలు లేదా సామాన్యులకు డిజిటల్ వారధిగా మారుతుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక పథకంలో భాగం కావడం మరియు హైదరాబాద్ ప్రజలకు మా వంతుగా ఈ చిరు సేవలను అందించడాన్ని మేము గౌరవ ప్రదంగా భావిస్తున్నాము’’ అని తెలిపారు. ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ప్రభుత్వంప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ లభించేలాకృషి చేస్తోంది. ఈ ఇంటర్నెట్ విస్తరణను రానున్న రోజుల్లో నూతన శిఖరాలకు చేర్చేందుకుACT సిద్ధంగా ఉంది.ACT ఫైబర్‌నెట్ 2000 సంవత్సరం నుంచి ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్వినియోగించుకోవడాన్ని ప్రోత్సహించింది.హైదరాబాద్‌లో అతి పెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌గా ACT నిలిచింది. దేశంలోని అతి పెద్ద ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ACT ఒకటిగా ఉంది.