Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోని నంబర్ వన్ స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన ఎంఐ ఇండియా సబ్ బ్రాండ్ రెడ్మి, నేడు తమ రెడ్మి బుక్ సిరీస్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. లేటెస్ట్ 11వ తరం ఇంటెల్® కోర్™ ప్రాసెసర్ల శక్తితో పని చేసే, ఈ ఉత్పత్తుల్లో రెండు సిరీస్‌ల సన్నని మరియు తేలికపాటి ల్యాప్‌టాప్‌లు- రెడ్మి బుక్ ప్రో మరియు రెడ్మి బుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్ ఉన్నాయి. ‘‘ఎక్కడి నుంచైనా పని చేయడం’’ మరియు ‘‘ఇంటి నుంచి నేర్చుకోవడం’’ కోసం తయారు చేసిన వీటిలోని ప్రత్యేకతలు, రెడ్మి బుక్ మొత్తం అనుభవాన్ని మెరుగుపరచడం ద్వారా ఒక వ్యక్తి ప్రొడక్టివిటీని అన్‌లాక్ చేసేందుకు సహాయపడుతుంది. సూపర్ స్టార్ట్ లైఫ్‌కు సరైన మిశ్రమాన్ని అందిస్తూ, రెడ్మి బుక్ సిరీస్‌లో ఆధునిక డిజైన్, దృఢమైన బిల్డ్ క్వాలిటీ మరియు ఆప్టిమైజ్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఇది 15.6’’ FHD డిస్ప్లే, 11వ తరం ఇంటెల్® కోర్™ ప్రాసెసర్లతో పాటు, 8GB DDR4 3200 MHz ర్యామ్, 10 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో పాటు, మల్టీ టాస్కర్లు వారి కలలు మరియు ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు మద్ధతుగా నిలుస్తుంది. వీటిని విడుదల చేసిన సందర్భంలో ఎంఐ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రఘు రెడ్డి మాట్లాడుతూ, ‘‘ మేము 2020 ప్రారంభం నుంచి మా ఫోన్-ప్లస్ వ్యూహంపై దృష్టి సారించి, ఇతర వినియోగదారు ఎలక్ట్రానిక్స్ విభాగాలను లోతుగా పరిశోధించాము. పవర్ బ్యాంక్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ బ్యాండ్, స్మార్ట్ వాచ్ మరియు స్మార్ట్ టీవీ తదితర కేటగిరీల్లో తయారు చేసి, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రతి ఉత్పత్తిని ఎంఐ అభిమానుల నుంచి చక్కని ప్రశంసలు అందుకోగా, మా ఉత్పత్తులతో పాటు సరికొత్త సాంకేతికతను వినియోగదారులకు మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము’’ అని తెలిపారు. నూతన ఉత్పత్తుల గురించి ఆయన మాట్లాడుతూ “మా మొట్ట మొదటి రెడ్మి బుక్‌ను మార్కెట్లో విడుదల చేయడంతో, మా వినియోగదారులు తమ లక్ష్యాలను సాధించుకునేందుకు సహాయపడడంతో పాటు పనితీరు మరియు పోర్టబిలిటీతో వారికి సాధికారత కల్పించాలని మేము కోరుకుంటున్నాము. లేటెస్ట్ 11వ జెన్ ఇంటెల్® కోర్™ ప్రాసెసర్లు, ప్రీమియం డిజైన్ మరియు అత్యుత్తమ పనితీరును అందించే ఈ ల్యాప్‌టాప్‌లు తమ ఆధునిక పని/అభ్యాస శైలికి మద్దతు ఇచ్చేందుకు, పరిష్కారాలను కోరుకునే వారికి సరైన ఎంపిక అని చెప్పవచ్చు. ఈ శక్తివంతమైన ల్యాప్‌టాప్‌లను తయారు చేసే ప్రయాణాన్ని మేము ఆస్వాదించినట్లే, మా వినియోగదారులు మరియు అభిమానులు దీనిని ఉపయోగించడాన్ని ఇష్టపడతారని మేము భావిస్తున్నాము’’ అని ధీమా వ్యక్తం చేశారు. వీటి విడుదల గురించి ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సీనియర్ డైరెక్టర్ రాకేశ్ కృష్ణన్ మాట్లాడుతూ, ‘‘స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌గా, వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా వారి అవసరాలను పరిష్కరించడంలో ఫ్లిప్‌కార్ట్ ముందంజలో ఉంది. మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి విద్యార్థులు, నైపుణ్య విభాగానికి చెందిన యువతకు అభ్యాసం మరియు వినోద అవసరాలను తీర్చేందుకు కంప్యూటింగ్ పరికరాలకు, ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. రెడ్మి బుక్ సిరీస్‌తో స్టూడెంట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ విభాగంలో రెడ్మి అడుగు పెట్టడం, ఈ విభాగాన్ని మరింత విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది మరియు దేశవ్యాప్తంగా మా లక్షలాది మంది వినియోగదారులకు మరిన్ని ఎంపికలను అందించనుంది’’ అని వివరించారు.
డిజైన్ మరియు డిస్ప్లే
డిజైన్‌లో చిన్న మార్పులు భారీ ప్రభావాన్ని ఎలా తీసుకు వస్తుందో తెలుసుకునేందుకు రెడ్మి బుక్ సరైన ఉదాహరణ. ఇది ఒక సంపూర్ణ సమతుల్యమైన చట్రంతో అందంగా తయారైంది. దీనిలో విభిన్నమైన కటౌట్ అమర్చబడి ఉండడంతో వినియోగదారులు దీనిని ఒకే వేలితో తెరవగలరు. ఆకర్షణీయమైన సొగసైన, సన్నని మరియు తేలికపాటి ఫారం ఫ్యాక్టర్‌తో, ఇది 19.9 మి.మీ. పల్చగా, కేవలం 1.8కిలోల బరువు ఉంటుంది. బ్రష్డ్ మెటాలిక్ బాడీ ఫినిషింగ్‌కి అనుబంధంగా, ల్యాప్‌టాప్ ఆకర్షణీయమైన చార్ కోల్ గ్రే కలర్లో అందుబాటులోకి వస్తుండగా, ఇది అద్భుతమైన డిజైన్ సౌందర్యాన్ని ఇస్తుంది. కొత్తగా విడుదల చేసిన ల్యాప్‌టాప్ శ్రేణి అద్భుతమైన 15.6’’ ఫుల్ HD డిస్ప్లే కలిగి ఉండడంతో, ఇది అనువైన పరిమాణాన్ని, మెరుగైన పని అనుభవాన్ని అందిస్తుంది. అదనంగా, తెరపై ప్రతిబింబాలను నివారించేందుకు మరియు ప్రకాశవంతమైన కాంతిమూలం ఉన్న వాతావరణంలో లేదా ప్రత్యక్షంగా పనిచేసేటప్పుడు మీ కళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నోట్బుక్లు యాంటీ-గ్లేర్ పూతతో వస్తాయి. ఇవి 1920x1080 పూర్తి HD రిసొల్యూషన్ మరియు సన్నని బెజెల్ కలిగిన రెడ్మి బుక్స్ స్పష్టమైన వీక్షణ అనుభవం కోసం 81.8% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందిస్తాయి. రెడ్మి బుక్‌లో 720P HD ఇంటిగ్రేటెడ్ కెమెరా మరియు డ్యూయల్ మైక్రోఫోన్ సెటప్ ఉండడంతో విద్యార్థులు మరియు వృత్తి నిపుణులు తమ వీడియో-కాల్ అవసరాలన్నింటికీ ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.
పనితీరు మరియు బ్యాటరీ
రాజీలేని పనితీరును, ప్రొడక్టివిటీని కోరుకునే వినియోగదారుల కోసం తయారు చేసిన రెడ్మి బుక్ ప్రో లేటెస్ట్ 11వ జెన్ టైగర్ లేక్ ఇంటెల్® కోర్™ i5 H35 సిరీస్ ప్రాసెసర్లలో ఒకటి కాగా, ఇది 11300H తో వస్తుంది. దీనిలో 4 కోర్లు మరియు 8 థ్రెడ్‌లతో మరియు గరిష్టంగా 4.4 GHz క్లాక్‌తో 35W వద్ద పని చేసేలా దీన్ని తయారు చేయగా, ఇది ఇంటెన్సివ్ ప్రొడక్టివిటీ వర్క్లోడ్లకు మరియు స్ట్రీమింగ్, ఎడిటింగ్ మరియు బ్రౌజింగ్ వంటి రోజువారీ మల్టీ-టాస్కింగ్‌కు సరైనది. ఈ ప్రాసెసర్ కూడా సాధారణ గేమింగ్ మరియు ఫోటో ఎడిటింగ్ మరియు వీడియో ఎడిటింగ్‌లతో తేలికపాటి కంటెంట్‌ను సృష్టించేందుకు అనుమతించే ఒక సన్నని మరియు తేలికపాటి పరికరంలో, అద్భుతమైన గ్రాఫిక్స్ పనితీరు కోసం Intel® Iris® Xe గ్రాఫిక్స్‌తో వస్తుంది. ఈ వేగవంతమైన ప్రాసెసర్‌ని పూర్తి చేయడానికి, మేము దీనిని 3200MHz వేగవంతమైన 8GB DDR4 రామ్ మరియు 512 GB NVMe SSDతో జత చేసిన ఫలితంగా సూపర్-ఫాస్ట్ బూట్-అప్, వేక్ మరియు ఫైల్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి. కొత్త రెడ్మి బుక్ ప్రో 15 క్షణాల్లోగా బూట్ అవుతుంది, అప్లికేషన్లను వేగంగా లోడ్ చేస్తుంది మరియు మొత్తం మీద మృదువైన అనుభవాన్ని అందిస్తుంది.
రెడ్మి బుక్ 46WHr బ్యాటరీ కలిగి ఉండడంతో రోజంతా 10 గంటల పనితీరును అందిస్తుంది. ఔట్ ఆఫ్ బాక్స్ 65W ఛార్జర్‌తో, వినియోగదారులు తమ నోట్‌బుక్‌ను 0 నుండి 50% వరకు 35 నిమిషాల్లోగా ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ప్రొడక్టివిటీ మరియు కనెక్టివిటీ
రెడ్మి బుక్ సౌకర్యవంతమైన మరియు అనువైన స్పేస్ కలిగిన సిజర్ మెకానిజం కీబోర్డ్‌ను కలిగి ఉంది. కీలు 1.5 మి.మీ. లోతైన ప్రయాణ దూరాన్ని కలిగి ఉండడంతో, ఇది టైప్ చేయడాన్ని చాలా సులభం చేస్తుంది మరియు సరైన స్పర్శ ఫీడ్‌బ్యాక్ అందిస్తుంది. ప్రొడక్టివిటీని వృద్ధి చేసేందుకు మరియు బ్రౌజింగ్‌ను సరళం చేసేందుకు, పనిని సౌకర్యవంతంగా చేసుకునేందుకు తయారు చేసిన ఈ నోట్బుక్లు పెద్ద 100 cm2 డిజైన్ ట్రాక్‌ప్యాడ్‌ను కలిగి ఉన్నాయి. ట్రాక్‌ప్యాడ్ విండోస్ ప్రెసిషన్ డ్రైవర్లకు మద్దతు ఇవ్వడంతో పాటు ఇవి స్వైప్‌లు మరియు మల్టీ ఫింగర్ ట్యాప్‌లను అనుమతిస్తుండగా, వీటిని వివిధ ప్రోగ్రామ్‌లు మరియు కమాండ్లకు షార్ట్కట్ల కోసం ఉపయోగించవచ్చు.
సుదీర్ఘమైన వర్క్ మీటింగ్‌లు, ప్రెజెంటేషన్ల సమయంలో స్పష్టమైన మరియు బిగ్గరైన సౌండ్ ఔట్పుట్ కోసం, ఇది రెండు 2W స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. ఇది ముందుగానే ఇన్స్టాల్ చేయబడిన డిటిఎస్ ఆడియో ప్రాసెసింగ్ యాప్‌ను కలిగి ఉండడంతో, ఇది ఉత్తమ కంటెంట్ వినియోగ అనుభవం కోసం ఆడియో సిగ్నేచర్‌ను చక్కగా ట్యూన్ చేసేందుకు అనుమతిస్తుంది.
ప్రొడక్టివిటీకి ప్రాధాన్యతనిస్తూ, రెడ్మి బుక్ 2x USB 3.2 Gen, 1x USB 2.0, 1x HDMI పోర్ట్, 1x గిగాబిట్ ఈథర్నెట్ పోర్ట్ మరియు 3.5 మి.మీ. కాంబో ఆడియో జాక్ మరియు SD కార్డ్ రీడర్ వంటి ముఖ్యమైన పోర్ట్‌లు అన్నింటితో కలుపుకుని చక్కని కనెక్టివిటీని అందిస్తుంది. వేగవంతమైన కనెక్టివిటీ పనితీరు కోసం, నోట్బుక్లు 2x2 Wi-Fi 5కి మద్ధతు ఇస్తాయి. ఇవి ప్రతి చోట మృదువైన మరియు స్థిరమైన Wi-Fi కనెక్టివిటీ కోసం రెండు యాంటెన్నాల శక్తిని ఉపయోగించుకుంటుంది. దీనిలో బ్లూటూత్ 5.0 ఉండడంతో, ఇది తక్కువ విద్యుత్ వినియోగంలో అధిక డేటా ట్రాన్స్ఫర్ వేగానికి మద్దతు ఇస్తుంది.
రెడ్మి బుక్ ల్యాప్‌టాప్‌లు రెండూ విండోస్ 10 హోమ్‌లో రన్ అవుతాయి మరియు దాని లభ్యతకు అనుగుణంగా విండోస్ 11కి ఉచిత అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఎంఎస్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ ఎడిషన్ 2019తో ముందే లోడ్ చేయబడింది, ఇది ఔట్ ఆఫ్ బాక్స్ నుంచి ప్రొడక్టివిటీ పవర్‌హౌస్‌గా మారుతుంది.
రెడ్‌మిబుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్
రెడ్‌మిబుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్‌ను ప్రత్యేకంగా- పాఠశాల విద్యార్థులు, కాలేజీ యువకులు లేదా ఆఫీసుకి వెళ్లే ఉద్యోగుల కోసం రూపొందించారు. సాంప్రదాయక అభ్యాసం, ఇంటి నుంచి పని చేసుకునేందుకు మరియు కేటాయించిన సమయంలో పని నేర్చుకునే వారికి ఈ ల్యాప్‌టాప్‌లు సరైన తోడుగా ఉంటాయి.
అదే ఆకర్షణీయమైన డిజైన్‌తో, రెడ్‌మిబుక్ ఇ-లెర్నింగ్ ఎడిషన్ లేటెస్ట్ 11వ జెన్ టైగర్లేక్ ఇంటెల్® కోర్™ i3 ప్రాసెసర్‌తో, 1115G4 గరిష్ట క్లాక్‌తో 4.1 GHz, లాగ్-రహిత పనితీరును అందిస్తుంది. ఇంకా, ఇది 8200GB DDR4 రామ్‌తో 3200 MHz వద్ద క్లాక్ చేయబడిన రెండు అంతర్గత స్టోరేజ్ ఎంపికలతో 256GB SATA SSD/ 512GB NVMe SSD, అవసరమైతే వినియోగదారులకు అదనపు స్టోరేజ్ ఎంపికను అందిస్తుంది. అదనంగా, ల్యాప్‌టాప్‌తో ఇంటి నుంచి వేగవంతంగా నేర్చుకోవడం/పని చేసేందుకు 720p HD వెబ్‌క్యామ్‌ను కూడా కలిగి ఉంది.