Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కూకట్పల్లి
జంటనగరాలకు చెందిన ప్రముఖ దంతవైద్యులు సర్జన్ డా. ఆకాష్ చక్రవర్తి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో సరితా డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తన మరో క్లినిక్ ను కూకట్పల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనుషుల్లో వచ్చే వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దంతాలు, వాటి అనారోగ్యం, దంతాల అపరిశుభ్రత కూడా కారణమవుతుంది అని చాలామందికి తెలియదని అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వ్యాధి వ్యాప్తిలో అనారోగ్యకరమైన దంతాలు, చిగుళ్లు కూడా ఒక కారణమని చెప్పారు. నోటి ద్వారా ప్రవేశించే కరోనా వైరస్ ముందుగా మనిషి దంతాలు, చిగుళ్లపై ప్రభావం చూపుతుందని, ఒకవేళ దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా లేకుంటే ఈ వైరస్ త్వరగా వృద్ధి చెంది మనిషి శరీరంలోకి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. అందుకోసమే శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సాధారణ దంత, చిగుళ్ల సమస్యలపై, కోవిడ్ నుంచి కొలుకున్న వారికి వచ్చే దంత, బ్లాక్ ఫంగస్ సమస్యలపై ఉచిత కన్సల్టెషన్, సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిపారు.