Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో ప్రీమియం కార్ల తయారీలో అగ్రగామి అయిన హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL), భారతదేశంలో ఈ రోజు, అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆల్ న్యూ 5వ జనరేషన్ హోండా సిటీని విడుదల చేసింది. భారతదేశంలో 1998 జనవరిలో తొలిసారి ప్రవేశపెట్టబడిన హోండా సిటీ, మధ్యతరహాపరిమాణపు సెడాన్లలో దేశంలో అత్యంత విజయవంతమైనది. భారతదేశంలో సెడాన్ అసలైన అధికారపు ఆకారానికి నిర్వచాన్ని చెబుతూ వచ్చిన హోండా, ఇప్పుడు తన 5వ జనరేషన్‌కు చేరుకున్న నేపథ్యంలో, తన కస్టమర్ల అవసరాలు మరియు ఆశలకు అనుగుణంగా తనను తాను పునరావిష్కరించుకున్నది. ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఆల్-న్యూ హోండా సిటీని, ఘనచరిత్రను కొనసాగించే విధంగా, ఆధిపత్యాన్ని అందించే విధంగా, తన కస్టమర్లకు అత్యుత్తమ విలువను అందించటం ద్వారా గతంలో నిర్ధారించిన ప్రమాణాలను అధిగమించే విధంగా రూపొందించటం జరిగింది.
భారతదేశంలోనూ, ఆసియాన్ దేశాల్లోనూ మరియు ఇతర మార్కెట్లలోనూ ప్రజలకు అవసరాలను, వారి జీవనశైలులను అనుసరించి జపాన్‌లోని తొచిగిలో నెలకొని ఉన్న హోండా ఆర్ అండ్ డి సెంటర్లో కొత్త హోండా సిటీని అభివృద్ధి చేయటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ గాకు నకనిషి, ప్రెసిడెంట్ మరియు సిఇఒ, హోండా కార్స్ ఇండియా, ఇలా అన్నారు, “22 సంవత్సరాలకు పైగా హోండా సిటీ, దీర్ఘకాలం నడుస్తున్న నేమ్‌ప్లేట్లలో ఒకటిగా, భారతదేశ ఆటోమోటివ్ చరిత్రలో మా వ్యాపారానికి మూలస్థంభంగా నిలిచి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 4 మిలియన్లకు పైగా విక్రయాలను కలిగి ఉన్న హోండా, భారతదేశంలో ఇప్పటికే 8 లక్షలకు పైగా కస్టమర్లకు సంతోషాలను పంచి ఇచ్చింది, ఇంకా మరెందరో ఈ మోడల్‌ను స్వంతం చేసుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. సిటీ తన ప్రతి జనరేషన్‌తో, డిజైన్, టెక్నాలజీ, నాణ్యత, డ్రైవింగ్‌లో ఆనందం, కంఫర్ట్ మరియు భద్రతల విషయాల్లో ప్రమాణాలను ఉన్నతం చేసింది. అంతే కాక పరిశ్రమలో తొలిసారిగానో లేక తన సెగ్మెంటులో తొలిసారిగానో ఎన్నో ఫీచర్లను అందిస్తూ వచ్చింది.” “సిటీ చరిత్రలో మునుపెరుగని విధంగా ఒక సరికొత్త విలువను మా కస్టమర్లకు అందించటం మా ఆశయం. మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంటులో ఆల్ న్యూ సిటీ తాజాగా ఉత్సాహాన్ని నింపగలదని మాకు నమ్మకం ఉన్నది,” అని అన్నారు. ఆల్ న్యూ 5వ జనరేషన్ హోండా సిటీలో, పొడుగు మరియు వెడల్పును మరింతగా పెంచటంతో, తన సెగ్మెంటులో దానిని అత్యంత పొడవైన మరియు వెడల్పైన సెడాన్ అయ్యింది. అన్ని గ్రేడ్లలోనూ స్టాండర్డ్ ఆఫరింగ్గా తదుపరి తరపు హోండా కనెక్టును అందుబాటులోకి తీసుకురావటం ద్వారా మరియు 5 సంవత్సరాల ఉచిత సబ్స్క్రిప్షన్ కల్పించటం ద్వారా కనెక్టెడ్ కార్ సర్వీసుల్లో, ఆల్ న్యూ సిటీ ఒక భారీ ముందడుగు వేసింది. అలెక్సా రిమోట్ కేపబిలిటీ కలిగిన భారతదేశం మొట్టమొదటి కనెక్టెడ్ కార్ ఇది. ఆల్-న్యూ హోండా సిటీని పెట్రోలు మరియు డీజిల్, రెండింటిలోనూ ప్రవేశపెట్టటమైనది. ఇందులో హోండావారి, బిఎస్-6 అనుపాలిత పవర్ట్రెయిన్ల అత్యుత్తమ ఎర్త్ డ్రీమ్స్ టెక్నాలజీ శ్రేణి – VTC కలిగిన ఆల్ న్యూ 1.5 L i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్ మరియు భారతదేశానికి ప్రత్యేకించిన రిఫైన్డ్ 1.5 L i-DTEC డీజిల్ ఇంజన్లు ఇంధనాన్ని అత్యధికంగా ఆదా చేస్తాయి, తక్కువ పొగ వెలువరిస్తాయి మరియు స్ఫూర్తిదాయకమైన డ్రైవింగ్ పాటవాన్ని ప్రదర్శిస్తాయి. 5వ జనరేషన్ హోండా సిటీ యొక్క గ్రాండ్ కాన్సెప్ట్ ఈ ‘యాంబీషియస్ సెడాన్’. ఇది తన కస్టమర్ల ఆశలను నెరవేర్చే లక్ష్యాన్ని కలిగి ఉన్నది, ఇంకా వారికి వారి జీవితాలను మెరుగుపరుచుకునే నమ్మకాన్ని బలంగా కలిగిస్తుంది. మెరుగైన స్టాన్స్, అధిక పటిష్టత, స్పోర్టీనెస్ మరియు సొఫిస్టికేషన్ల పై దీని డిజైన్ కాన్సెప్ట్ ప్రత్యేకమైన దృష్టిని సారించింది. ఈ సెగ్మెంటులో అతి పెద్ద కొలమానాలను, అనగా 4549 మిమీల పొడవు మరియు 1748 మిమీల వెడల్పుతో, ఆల్ న్యూ సిటీ సగర్వంగా అందిస్తోంది. కొత్త మోడల్ యొక్క ఎత్తు 1489 మిమీలు కాగా, వీల్‌బేస్ 2600 మిమీలు. శ్రీ రాజేష్ గోయల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరెక్టర్, మార్కెటింగ్ అండ్ సేల్స్, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్, ఇలా అన్నారు,“యాంబీషియస్ కస్టమర్‌కు యాంబీషియస్ సెడాన్ అందించటం మా లక్ష్యం. సిటీకి ఎల్లప్పుడూ ఒక పటిష్టమైన బ్రాండ్ ఈక్విటీ ఉన్నది. ఈ 5వ జనరేషన్‌తో మేము తెలివైన, విశ్వాసంతో కూడిన మరియు సురక్షితమైన ఉనికిని మరింతగా పెంచుకున్నాము. సిటీ కస్టమర్లు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఎంచుకునేవారు, మిగిలినవాటి కన్నా ఒక శ్రేణి ఎగువ కార్ కావాలని కోరుకునేవారు. అందువలన, స్టైలింగ్, కనెక్టివిటీ, భద్రత మరియు సౌలభ్యం విషయాల్లో పలుమార్లు ‘పరిశ్రమలో తొలిసారి’ మరియు ‘సెగ్మెంటులో అత్యుత్తమ ఫీచర్ల’ను ఆల్ న్యూ సిటీ యొక్క ప్రారంభ V వేరియంట్ నుండి స్టాండర్డ్‌గా ఆఫర్ చేయటం, తద్వారా ఆ సెగ్మెంటుకు ఒక కొత్త ప్రమాణాన్ని నిర్ధారించటం జరిగింది.”
అత్యుత్తమ డిజైన్
9 ఎల్ఇడి యర్రే ఇన్లైన్ షో కూడిన ఫుల్ ఎల్ఇడి హెడ్ల్యాంపులు, ఇంటెగ్రేటెడ్ ఎల్ఇడి డిఆర్ఎల్, L ఆకారపు ఎల్ఇడి టర్న్ సిగ్నల్ మరియు విలక్షణమైన, యూనిఫాం ఎడ్జ్ లైట్ సౌకర్యం కలిగిన Z- ఆకారపు 3డి రాప్-అరౌండ్ ఎల్ఇడి టెయిల్ ల్యాంపులు, వన్-టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆర్-16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాలు కలిగిన ఆల్ న్యూ సిటీ యొక్క మొత్తం స్టైలింగ్, భారతదేశపు రోడ్ల పై చూపులను ఆకట్టుకుని తీరుతుంది, దూరం నుండి చూసీ చూడగానే ‘సిటీ’ అని గుర్తించగలిగేట్లు చేస్తుంది. సొగసైన ఎక్స్టీరియర్కు అదనంగా, ఈ 5వ తరపు హోండా సిటీ, కారు లోపల విశాలమైన చోటు మరియు సౌకర్యాలను అందిస్తుంది. ప్రజలదే అగ్రతాంబూలమనే ఆశయంతో స్ఫూర్తిని పొంది ఉండటంతో, ఇందులో ఇంటీరియర్లు ‘మనిషి ఎక్కువ మెషీన్ తక్కువ’ సిద్ధాంతం పై ఆధారపడి ఉన్నాయి. కొత్త సిటీ, ఈ శ్రేణిలో అత్యుత్తమమైన విధంగా మోకాలికి మరియు కాలికి ఖాళీ ప్రదేశాన్ని కల్పించింది, వెనుక సీటులో మరింత ఎక్కువ షోల్డర్ రూమ్, జీవనశైలికి అనుగుణమైన విదంగా రూపొందించిన కాక్‌పిట్, పలు స్టోరేజ్ స్పేస్‌లు, 506 లీటర్లతో అత్యుత్తమ శ్రేణి ట్రంక్ కెపాసిటీలను ఆఫర్ చేస్తోంది.
అత్యుత్తమ పవర్ట్రెయిన్లు
వైభవం, బలం మరియు స్టాన్సుకు అదనంగా, 5వ జనరేషన్ హోండా సిటీ, హోండావారి ఎర్త్ డ్రీమ్ సిరీస్ యొక్క అధునాతన మరియు వినూత్న పవర్ట్రెయిన్లతో ఆధిక్యతను ఆఫర్ చేస్తోంది. ఈ పవర్ట్రెయిన్లు డ్రైవింగ్ పనితీరును మరియు ఇంధనం పొదుపును మరింత ఎక్కువగా పెంచుతాయి.
ఆల్ న్యూ సిటీ యొక్క పెట్రోల్ వేరియంట్లో కొత్త 1.5L i-VTEC DOHC పెట్రోల్ ఇంజన్ VTCతోపాటు ఉంటుంది. ఇది భారతదేశంలో హోండావారు మొదటిసారి తీసుకువస్తున్నారు. హై యాక్యురసీ వాల్వ్ టెక్నాలజీ DOHC + VTC ఆధారంగా రూపొందిన, కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ బిఎస్-6 ఇంజన్, ఇంధనం మండే విషయంలో సామర్ధ్యాన్ని పెంచుతుంది, రాపిడిని తగ్గించి, వెలువడే పొగను తగ్గిస్తుంది. అధిక సామర్ధ్యాన్ని కలిగిన ఈ ఇంజన్ ఈ సెగ్మెంటులో అత్యుత్తమంగా 89 kw (121PS) @6600 rpmను మరియు 145 Nm@1750 rpm టార్కును అందిస్తోంది. తక్కువ ఇంజన్ స్పీడ్ వద్ద సత్వర టార్క్ పెరుగుదల ఉంటుంది. దీనిని ఆల్-న్యూ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్కు అనుసంధానించి లీటరుకు 17.8 కిమీల ఇంధన సామర్ధ్యాన్ని మరియు న్యూ 7 స్పీడ్ సివిటి (కంటిన్యువస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్)లతో అనుసంధానించి లీటరుకు 18.4 కిమీల ఇంధన సామర్ధ్యాన్ని ఆఫర్ చేయటం జరుగుతోంది. ఆల్-న్యూ సిటీ యొక్క డీజిల్ వేరియంట్లో కొత్త 1.5L i-DTEC DOHC డీజిల్ ఇంజన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానించటమైనది. ఇది శక్తివంతమైన 73 kW [100 PS] @ 3600 rpm శక్తి, 200 Nm @1750 rpm టార్క్ పనితీరు మరియు ఆకర్షణీయమైన విధంగా లీటరుకు 24.1 కిమీల ఇంధన సామర్ధ్యాలను అత్యుత్తమంగా మేళవించి అందిస్తుంది. డీజిల్ ఇంజన్ల విషయంలో పార్టిక్యులేట్ మ్యాటర్ (పిఎం) మరియు నైట్రోజన్ ఆక్సైడ్ (NOx)ల విడుదలకు సంబంధించిన దుర్గమమైన లక్ష్యాన్ని సాధించేందుకు NSC (NOx స్టోరేజ్ ఉత్ప్రేరకం)తో మరియు DPF (డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్)లతో కూడుకున్న అధునాతనమైన ఎగ్జాస్ట్ గ్యాస్ ఆఫ్టర్-ట్రీట్మెంట్ వ్యవస్థను ప్రయోగంలోకి తీసుకురావటమైనది.
అత్యుత్తమ కనెక్టివిటీ
ఆల్ న్యూ సిటీ, భారతదేశంలో మొట్టమొదటిసారి అలెక్సా రిమోట్ సామర్ధ్యంతో అనుసంధానించబడిన కార్. పైగా ఇందులో టెలీమాటిక్స్ కంట్రోల్ యూనిట్ (టిసియు) తో కూడిన తదుపరి జనరేషన్ హోండా కనెక్ట్, అన్ని గ్రేడ్లలోనూ, 5- సంవత్సరాల ఉచిత సబ్స్క్రిప్షన్తోపాటుగా స్టాండర్డ్గాగా అమర్చబడి లభిస్తోంది. 32 ఫీచర్లకు పైగా కలిగి ఉన్న నెక్స్ట్ జెన్ హోండా కనెక్ట్, భద్రత మరియు రక్షణ లభిస్తున్న భావనను, సౌకర్యం మరియు మనఃశాంతితో కూడిన భావనలను కస్టమర్లకు కలిగించే లక్ష్యం కలిగి ఉన్నది. అలెక్సాకు వాయిస్ ఆదేశాలను ఇవ్వటం ద్వారా, అమెజాన్‌కు చెందిన క్లౌడ్-ఆధారిత వాయిస్ సర్వీస్ ఉపయోగించి, కస్టమర్లు హోండా కనెక్ట్‌లోని 10 కీలకమైన ఫీచర్లను ఉపయోగించి తమ కారును ఇంటి నుండే పర్యవేక్షించి, నియంత్రించగలుగుతారు. అందువలన వారు తమ కారు ఎసి ఆన్/ఆఫ్, డోర్ లాక్/అన్‌లాక్, ఇంధనం స్థితిని కనుగొనటం, కార్ ఉన్న ప్రదేశాన్ని కనుగొనటం, కార్ డ్యాష్‌బోర్డు నుండి స్టాటస్ పొందటం వంటి ఫీటర్లను దూరంగా ఉండే ఉపయోగించుకోగలుగుతారు. తద్వారా సాటిలేని సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని పొందగలుగుతారు.
అత్యుత్తమ భద్రత
సిటీ యొక్క అడ్వాన్సుడ్ కంపాటిబిలిటీ ఇంజనీరింగ్™ (ACE™) బాడీ కారణంగా, ఏదైనా వాహనాన్ని ఢీకొన్న తరుణంలో, స్వయం-రక్షణను పెంపొందించి, ఎదుటి వాహనాలకు తక్కువగా నష్టం వాటిల్లేట్లు చేస్తుంది. 5వ తరపు హోండా సిటీ పలు రకాల సక్రియము మరియు నిర్లిప్తమైన అధునాతన రక్షణ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. వాటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల వ్యవస్థ, EBD మరియు బ్రేక్ అసిస్ట్‌లతో కూడిన ABS, ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్‌తో కూడిన వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హోండా లేన్ వాచ్™ కెమేరా, మల్టీ యాంగిల్ రేర్ కెమేరా, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, లోయర్ యాంకరేజ్‌లు మరియు టాప్ టెదర్ కలిగిన ISOFIX అనుగుణ్యమైన రేర్ సైడ్ సీట్లు, యాంటీ-థెఫ్ట్ అలారంతో కూడిన ఇమ్మొబిలైజర్ వంటివి ఉన్నాయి.
అత్యుత్తమ సౌలభ్యం
ఆల్-న్యూ సిటీలో హోండా అడ్వాన్స్డ్ స్మార్ట్ కీ సిస్టమ్, దానితోపాటు వాక్ అవే ఆటో లాక్ ఫీచర్, రిమోట్ ఇంజన్ స్టార్ట్ (సివిటిలో) మరియు కీలెస్ విండో రిమోట్ ఆపరేషన్, మాక్స్ కూల్‌తో కూడిన పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎరుపు నీలం ఎలిమినేషన్‌తో కూడిన క్లిక్ ఫీల్ ఎసి డయల్స్, చార్జింగ్ పోర్టులతో కూడిన రేర్ ఎసి వెంట్లు, డ్రైవర్ సీట్ హైట్ ఎడ్జస్టర్, ఎల్ఇడి మ్యాప్ మరియు రేర్ రీడింగ్ ల్యాంపులతో సౌకర్యం అత్యుత్తమంగా లభిస్తోంది.
అత్యుత్తమ కాక్‌పిట్
జీవనశైలికి అనుగుణంగా రూపొందించబడిన మరియు జాగ్రత్తగా ఆలోచించి అమర్చిన ఇనుస్ట్రమెంట్ ప్యానెల్లో 20.3 సెంమీల అధునాతన టచ్‌స్క్రీన్ డిస్ప్లే ఆడియో ఉంటుంది. ఇది యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను కనెక్ట్ చేస్తుంది. తద్వారా, డ్రైవ్ చేసేటప్పుడు ఇది సోషల్‌గా ఉంటూనే, డిజిటల్‌గా ముందుకు సాగేందుకు ఉపకరిస్తుంది. ఇందులోని ఇతర ఫీచర్లలో, మల్టీ-ఫంక్షన్ డ్రైవర్ సమాచార ఇంటర్ఫేస్తో కూడిన జి-మీటర్‌తో కూడిన 17.7 సెంమీల HD ఫుల్ కలర్ TFT మీటర్, డిజిటల్ స్పీడ్ మరియు క్రూయిజ్ కంట్రోల్ డిస్ప్లే , వెబ్ లింక్ స్మార్ట్ కనెక్టివిటీ, 8 స్పీకర్ల ప్రీమియం సరౌండ్ సౌండ్ వ్యవస్థ, పరిసరాలకు అనుగుణ్యమైన లైటింగ్ మరియు ఎల్ఇడి ఇంటీరియర్ ల్యాంపులు, CVT కోసం స్టీరింగ్ మౌంటెడ్ ప్యాడిల్ షిఫ్టర్లు ఉన్నాయి.
ఆల్ న్యూ 5వ జనరేషన్ హోండా సిటీ, 3 ఫీచర్లు ప్యాక్ చేయబడిన గ్రేడ్స్‌లో పెట్రోలు మరియు డీజిల్ వేరియంట్లు - V, VX మరియు ZXలలో లభించనున్నది. పెట్రోల్ మోడల్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనూ మరియు 7-స్పీడ్ సివిటిలోనూ లభించనుండగా, డీజిల్ మోడల్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో, 3 గ్రేడ్లలోనూ లభించనుంది. మొత్తం మూడు గ్రేడ్లలోనూ, పరిశ్రమలో తొలిసారి మరియు సెగ్మెంటులో అత్యుత్తమ ఫీచర్లుగానూ, స్టైలింగ్, కనెక్టివిటీ, సేఫ్టీ మరియు సౌలభ్యాల కోస పలు ఫీచర్లను స్టాండర్ట్‌గా ఆఫర్ చేయటం జరుగుతోంది, తద్వారా ఈ సెగ్మెంటుకు ఒక కొత్త ప్రామాణికతను నిర్ధారించటం జరిగింది.
ఆల్ న్యూ సిటీ 5 కలర్లు – రేడియంట్ రెట్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, మోడ్రన్ స్టీల్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ - ఆప్షన్ల ఛాయిస్‌తో అందుబాటులోకి రానున్నది.
5వ జనరేషన్ సిటీ, కస్టమర్లకు వైర్లెస్ ఛార్జర్ (స్మార్‌ఫోన్ హోల్డర్‌తో కూడినది)తో పాటు, స్విచ్ కలిగిన ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్, లెగ్ రూమ్ ల్యాంప్, ఎల్ఇడి కలిగిన ట్రంక్ స్పాయిలర్, ఫ్రంట్ మరియు రేర్ బంపర్ ప్రొటెక్టర్, సైడ్ ఎయిర్ బ్యాగ్ అనుగుణ్యమైన సీట్ కవర్, క్రోమ్ కలిగిన డోర్ వైజర్ వంటి పలు రకాల యాక్సెసరీ ఛాయిస్‌లను, ఇంకా మరెన్నింటినో అందజేస్తోంది.
HCIL, పెట్రోల్ వేరియంట్ల కొత్త సిటీ డెలివరీలను హెచ్‌సిఐఎల్ డీలర్ నెట్వర్కు నుండి దేశవ్యాప్తంగా తక్షణమే ప్రారంభించనున్నది. డీజిల్ వేరియంట్ల డెలివరీలు ఆగస్టు 2020 నుండి ప్రారంభం అవుతాయి.
3 సంవత్సరాల అపరిమిత కిలోమీటర్ల వారెంటీని ప్రామాణిక బెనిఫిట్‌గా కస్టమర్‌కు అందజేయటం ద్వారా ఆల్ న్యూ సిటీ, పూర్తిగా మనఃశాంతిని ఆఫర్ చేస్తోంది. అంతేకాక, కస్టమర్లు అదనంగా రెండు సంవత్సరాల అపరిమిత/పరిమిత కిలోమీటర్ల వారెంటీ కూడా ఎంచుకోవచ్చు. తద్వారా మరింత మనఃశాంతిని వారు పొందగలుగుతారు. 1 ఏడాది వ్యవధి/10,000 కిమీలలో ఏది ముందైతే అప్పుడు సర్వీస్ చేయటం ద్వారా ఈ కార్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చును ఆఫర్ చేస్తోంది.
కస్టమర్లు తమ ఇంటిలో సుఖంగా కూర్చుని కూడా ఆన్లైన్లో హోండావారి ఆన్లైన్ సేల్స్ ప్లాట్ఫారం "Honda from Home" పైన మరియు దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌సిఐఎల్ అధీకృత డీలర్షిప్ నెట్‌వర్క్‌లో ఆల్ న్యూ సిటీని బుక్ చేసుకోగలుగుతారు.
హోండా సిటీ గురించి
హోండా సిటీ అత్యంత హై బ్రాండ్ సమానత్వంతో అత్యంత విజయవంతమైన కారు బ్రాండ్లలో ఒకటి. ఇది భారతదేశంలో మొదటిసారిగా తమ 1వ జనరేషన్ లో 1990లో జనవరిలో మరియు తదుపరి 2003 నవంబర్ లో2వ జనరేషన్, 2008 సెప్టెంబర్ లో 3వ జనరేషన్, 2014 జనవరిలో 4వ జనరేషన్ ప్రవేశపెట్టబడ్డాయి. ఇప్పటి వరకు మొత్తంగా 8 లక్షల కార్లు అమ్ముడయ్యాయి. హోండా సిటీ ప్రస్తుతం అంతర్జాతీయంగా 60 దేశాలలో మొత్తంగా 4 మిలియన్ యూనిట్లను విక్రయించింది మరియు ఆసియా మరియు ఒషీనియా ప్రాంతంలో ప్రముఖ హోండా బ్రాండ్ గా నిలిచింది.