Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒప్పో ఇండియా నిత్యం నాణ్యతకు కొత్త కొలమానాలను నెలకొల్పుతోంది. తన నిబద్ధతకు రుజువుగా తన రెనో6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను 150 కఠిన నాణ్యత పరీక్షలకు గురి చేస్తుండగా, దానిలో పర్యావరణ పరీక్షలు, మెకానికల్ స్ట్రెస్ పరీక్షలు మరియు పనితీరు పరీక్షలు ఉన్నాయి. ఒప్పో క్యూ.ఇ. రిలయబిలిటీ ల్యాబ్‌ను గ్రేటర్ నోయిడా ఫ్యాక్టరీలో అభివృద్ధిపరచగా, తన ఉత్పత్తుల పరిధిని ఉన్నత నాణ్యతను కాపాడుకునే ఉద్దేశాన్ని కలిగి ఉంది. ఉత్పత్తిని సామూహికంగా తయారు చేసేవారికి క్యూ.ఇ. రిలయబిలిటి ల్యాబ్ అత్యంత కఠిన కొలమానాలను అనుసరిస్తోంది. ఒప్పో ఇండియా ఉపాధ్యక్షుడు మరియు ఆర్ డ డి అధికారి తస్లిమ్ ఆరిఫ్ మాట్లాడుతూ 'స్థిరత్వం మరియు విశ్వసనీయత ఆనందదాయక స్మార్ట్‌ఫోన్ అనుభవ కేంద్రానికి పునాదులుగా ఉన్నాయి. మానవాళికి సాంకేతికత, ప్రపంచానికి కరుణ అనే లక్ష్యాలకు అనుగుణంగా మేము సదా ఉత్పత్తి నాణ్యతను మా సుస్థిరమైన, దీర్ఘావధి అభివృద్ధిగా చేపట్టాము. రాజీలేని నాణ్యతకు ప్రాతినిధ్యం వహించేందుకు మేము సదా సిద్ధంగా ఉన్నాము మరియు మా ఉత్పత్తులు అన్నింటిలో నాణ్యత పరీక్షల పట్ల అలుపెరుగని ప్రయత్నాల ఫలితాలుగా ఉన్నాయి. మా ప్రాధాన్యత వినియోగదారులు పరికరాలను వినియోగించే సమయంలో కింద పడడం, నీరు పడడం జరిగితే పరికరానికి హాని కలుగకుండా రక్షణ అందించడంతో పాటు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రీమియం పరికరాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాము' అని వివరించారు. వినియోగదారులకు అగ్రగామి విశ్వసనీయమైన అనుభవాన్ని అందించేందుకు ఒప్పో ఇటీవల విడుదల చేసిన రెనో 6 సిరీస్ స్మార్ట్ ఫోన్లను ఈ పరిశ్రమలోనే అత్యంత కఠినమైన పరీక్ష ప్రక్రియలకు గురి చేసింది: డ్రాప్ టెస్టులు, వాటర్ ప్రూఫింగ్ పరీక్షలు, పర్యావరణానికి అనుగుణమైన పరీక్షలు, మన్నిక పరీక్షలు తదితరాలు ఇందులో ఉన్నాయి. ఈ అన్ని పరీక్షలను సాధారణ దైనందిక వినియోగపు సందర్భంలో ఎలా పని చేస్తాయి అనేందుకు మూల్యాంకనానికి అనుగుణంగా డిజైన్ చేశారు.
డ్రాప్ టెస్ట్
ఉదాహరణకు, నేలపై ఫోన్ పడడం ఒకటైతే, నీటిలో పడడం ద్వారా కొత్తరకం సమస్యలను తీసుకు వస్తుంది. వాటర్ ప్రూఫ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు రెనో 6 సిరీస్‌ను 30 క్షణాల పాటు 20 సెం.మీ. లోతు నీటిలో పరీక్షించారు. ఫోన్ యుఎస్బి మరియు హెడ్ ఫోన్ ఇన్పుట్లను పరీక్షించేందుకు యుఎస్బి కేబుళ్లు మరియు హెడ్‌ఫోన్ జాక్‌లను తలా 10,000 సార్లు వివిధ కోణాల్లో ఉంచారు. యుఎస్బి ఇన్పుట్ను 3 కిలోల ఒత్తిడి ఉపయోగించి 5,000 నుంచి 10,000 సార్లు యుఎస్బి కేబుల్‌కు అలవర్చి స్వింగ్ చేసి కూడా పరీక్షించారు.
ఎన్విరాన్మెంట్ వర్క్ టెస్ట్
ఒప్పో ఎన్విరాన్మెంటల్ వర్క్ టెస్ట్‌తో ఇది ఫోన్‌ను -40 డిగ్రీ సెంటీగ్రేడ్ మేర అత్యంత తక్కువ ఉష్ణోగ్రత మరియు 75 డిగ్రీ సెంటీగ్రేడ్ మేర ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో 7 రోజులు (168 గంటలు) ఉంచి పరీక్షించగా, అది ఈ పరిశ్రమలోని 3 రోజులు (72 గంటల) కొలమానానికి పోల్చితే రెట్టింపు సమయాన్ని పరీక్షకు తట్టుకుంది. ఈ ఫోన్‌ను తీవ్రమైన తేమ మరియు ఉష్ణోగ్రత (65 డిగ్రీ సెంటీ గ్రేడ్‌లో 95% మేర తేమ)లో 14 రోజులు (336 గంటలు) పరీక్షించగా, అది ఈ పరిశ్రమలోని 3 రోజులు (72గంటల) కొలమానానికి పోల్చితే రెండు రెట్లు ఎక్కవ సమయంగా ఉంది.
రెయిన్ టెస్ట్
ఒటిఎ ల్యాబ్
ఒప్పో ఒటిఎ ల్యాబ్ ఫోన్ యాంటెన్నాల రేడియేషన్ దక్షతను పరీక్షించేందుకు కఠిన పరీక్షలను నిర్వహించింది మరియు 5జితో కూడిన వివిధ బ్యాండ్లలో దేశంలో ఎక్కడి నుంచైనా సరే దానికి సరిసాటి లేని, సమస్యల రహిత పనితీరు నిర్వహణను అందిస్తుంది.
మానవ-కేంద్రితత బ్రాండ్ నమ్మకం నేపథ్యంలో వినియోగదారుల అనుభవం తాను చేసే ప్రతి ఒకదాన్ని హృదయంలో ఉంచుకుంది. ఒప్పో తన వినియోగదారులకు విశ్వసనీయమైన అనుభవాన్ని అందించేందుకు శ్రమిస్తుండగా, ఇది అత్యంత కఠిన కొలమానాలకు అనుగుణంగా ఉత్పత్తులను డిజైన్ చేసే సమయంలో మరియు పరీక్షించే సమయంలో ఇది ఎప్పటికీ ఎడ్జ్‌లను కత్తిరించదు.