Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ సీఐఎల్), భారతదేశంలో ప్రీమియం కార్ల ప్రముఖ తయారీదారు భారీగా ఉత్పత్తిని ఆరంభించింది మరియు తమ ప్రసిద్ధి చెందిన కుటుంబ సిడాన్ న్యూ హోండా అమేజ్ ని రాజస్థాన్ లోని తపుకరాలో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి పంపిణీ చేసింది. కొత్త అమేజ్ 2021 ఆగస్ట్ 18న ప్రారంభించబడనుంది. అభివృద్ధిలు గురించి మాట్లాడుతూ, శ్రీ రాజేష్ గోయల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు డైరక్టర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, “మా తయారీ ప్లాంట్ లో విజయవంతంగా ఉత్పత్తి స్థాయిని పెంచి అన్ని మోడల్స్ కోసం సరఫరాల్ని అందుబాటులోకి తెచ్చిన తరువాత ఆరంభించే సమయం నుండి నెట్ వర్క్ లో కార్ల లభ్యతని నిర్థారించడానికి కొత్త అమేజ్ యొక్క భారీ ఉత్పత్తి మరియు పంపిణీలు మేము ఆరంభించాము. కొత్త అమేజ్ తమ మరింత ప్రీమియం మరియు ఆధునిక ఆఫరింగ్ తో మా కస్టమర్లను ఆకర్షిస్తుందని మరియు తమ కుటుంబాలు కోసం పరిపూర్ణమైన ఎంపికగా ఉంటుందని మేము ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉన్నాము.” కంపెనీ ఇటీవల కొత్త అమేజ్ ప్రీ-లాంచ్ బుక్కింగ్స్ ని ఆరంభించింది, దీని ప్రకారం ఆసక్తి గల కస్టమర్లు తమ కార్ ని హెచ్ సీఐఎల్ వారి వెబ్ సైట్ పై ‘హోండా ఫ్రం హోం’ వేదిక వద్ద లేదా దేశవ్యాప్తంగా అథీకృత హోండా డీలర్ షిప్స్ వద్ద బుక్ చేయవచ్చు. ప్రస్తుతం తమ 2వ తరంలో ఉన్న హోండా అమేజ్, హోండా వారి అతి ఎక్కువగా విక్రయించబడే మోడల్ మరియు భారతదేశంలో వివిధ కస్టమర్లని ఆనందిస్తోంది. భారతీయ కస్టమర్లు యొక్క ఎప్పటికీ తలెత్తే అవసరాలు మరియు అభిలాషల్ని దృష్టిలో పెట్టుకొని మోడల్ తయారైంది. ఇదితమ ప్రస్ఫుటంగా కనిపించే డిజైన్, ఆధునిక మరియు విశాలమైన ఇంటీరియర్లు, సాటిలేని డ్రైవింగ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు మరియు భద్రతా టెక్నాలజీలతో ‘సిడాన్ అనుభవం కంటే ఒక తరగతిని అధికంగా’ అందించే సమకాలీన మరియు ప్రీమియం మోడల్ ఇది. హోండా అమేజ్ కి 1.5 లీ ఐ-డీటీఈసీ డీజిల్ ఇంజన్ మరియు 1.2లీ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్ ల శక్తితో మేన్యువల్ గా మరియు సీవీటీ వెర్షన్స్ లో రెండు ఇంధన ఐచ్ఛికాలు కోసం లభిస్తోంది.