Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమ తాజా బ్రాండ్ ప్రచారాన్ని తమ నూతన బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ తో విడుదల చేస్తున్నట్లు మింత్రా వెల్లడించింది. ఈ ప్రకటన ద్వారా భారతదేశపు ఫ్యాషన్ నిపుణునిగా బ్రాండ్‌ను నిలుపనున్నారు. భారీ దేశ వ్యాప్తంగా తారలతో కూడిన బ్రాండ్ ప్రచారం చేయాలనే లక్ష్యంలో, ఈ ప్రకటన ఓ భాగం. ఈ లక్ష్యంలో భాగంగా సినిమా రంగంలోని నటులు, వినోదం మరియు ఎక్కువ మంది అభిమానించే ఫ్యాషన్ ఐకాన్లుగా గుర్తింపు పొందిన ఫ్యాషన్ రంగ నిపుణులతో ఈ ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భారతదేశపు ఓ ఈ–కామర్స్ బ్రాండ్ కోసం అతిపెద్ద సెలబ్రిటీ ఆధారిత ప్రచారాలలో ఒకటిగా దీనిని నిలుపనున్నారు. విజయ్ యొక్క అసాధారణ ప్రజాదరణతో పాటుగా విభిన్న భాషలలో ఆయన సాధించిన విజయాలు మరియు కష్టపడకుండానే అత్యంత ఆకర్షణీయంగా కనబడే ఆయన సామర్థ్యానికి తోడు ఆయన ఆకర్షణీయమైన వైఖరి కారణంగా ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. ఈ భాగస్వామ్యం, ఖచ్చితంగా వినియోగదారులు తమ అభిమాన నటుని వార్డ్రోబ్ను మింత్రా పై మరింతగా వెదికేందుకు తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా విజయ్‌కు ఉన్న అభిమానగణం, ఇప్పుడు ప్రీమియం ప్రాధాన్యతా ఫ్యాషన్ కేంద్రంగా మింత్రా స్థానాన్ని మరింత శక్తివంతంగా మార్చడంతో పాటుగా బ్రాండ్‌కు అదనపు ప్రాముఖ్యతను సైతం తీసుకువస్తుంది.
మింత్రా ఇప్పుడు మెగా బ్రాండ్ ప్రచారాన్ని పలు సినీ రంగాలకు చెందిన తాగారణంతో కలిపి రూపొందించింది. దీనిలో అమితాదరణ కలిగిన సెలబ్రిటీలు కనిపించనున్నారు. తమ నటనా చాతుర్యం, ఫ్యాషన్ శైలి కారణంగా ఎక్కువ మంది ఈ తారలను అభిమానిస్తుండటంతో పాటుగా ఆరాధిస్తున్నారు. మింత్రా ఇప్పుడు ఈ తారలతో తమ అతిపెద్ద బ్రాండ్ కమర్షియల్స్ విడుదల చేయడానికి సిద్ధమైంది.
బ్రాండ్ ప్రచారం గురించి
అన్ని వర్గాలకు చెందిన, దినదినాభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ప్రేమికులను చేరుకోవాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్ ప్రచారాన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రచారాల ద్వారా ఫ్యాషన్ నైపుణ్యాన్ని భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే, ట్రెండ్ సెట్టర్స్ సహాయంతో తెలుపనున్నారు. ఈ ప్రచారం, క్లుప్తంగానే అయినప్పటికీ భారతదేశపు ఫ్యాషన్ నిపుణుడు మింత్రా అనే అత్యంత లోతైన సందేశాన్ని సైతం వెల్లడిస్తుంది. ఇది వినియోగదారులకు ప్రత్యక్షంగా, స్పష్టంగా, మరుపురాని సందేశం ఃఒకవేళ అది ఫ్యాషన్ అయితే, అది మింత్రా అని వెల్లడిస్తుంది.
అదనంగా, ఈ సందేశం, మింత్రా యొక్క వైవిధ్యమైన ఫీచర్లు అయినటువంటి మింత్రా స్టూడియో గురించి కూడా వెల్లడిస్తుంది. షాపింగ్ చేయగల ఫ్యాషన్ ఫీడ్, మింత్రా స్టూడియో. అక్కడ వినియోగదారులు తమకు కావాల్సిన స్ఫూర్తి పొందడంతో పాటుగా భారతదేశపు అగ్రశ్రేణి ప్రభావశీలుర లుక్స్‌ను సైతం కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫోటో సెర్చ్ ఫీచర్. దీనిద్వారా వినియోగదారులు తాము చూసిన ఏ అంశాన్ని అయినా ఒక్క క్లిక్‌తో కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. మెన్స్ క్యాజువల్, ఫార్మల్ వేర్‌ను దీని ద్వారా ప్రచారం చేస్తున్నారు. గ్యారెంటీడ్ మరియు సౌకర్యవంతమైన మార్పిడి, రిటర్న్స్‌తో ప్రతి ఒక్కరి విభిన్న ఫ్యాషన్ అవసరాలను అర్థం చేసుకునే ‘భారతదేశపు ఫ్యాషన్ నిపుణుని’గా మింత్రా ఏ విధంగా నిలిచిందో చూపుతుంది.
యాడ్ చిత్రం గురించి
ఈ 35 సెకన్ల ప్రకటన చిత్రం విజయ్ పై దృష్టి పెట్టింది. ఓ వీధిలో స్టైలిష్‌గా, అందంగా నడుచుకుంటూ వెళ్తుంటారు విజయ్. మింత్రా బ్రాండ్ యొక్క వ్యక్తిత్వానికి ప్రతీకగా చెప్పబడుతున్న ఆయన, వీక్షకులను తన సినిమాటిక్ ఛరిష్మా, అద్భుతమైన లుక్స్‌తో బ్రాండ్ యొక్క విలువ ప్రతిపాదన ద్వారా ముందుకు తీసుకువెళ్తారు. ఫ్యాషన్ నిపుణునిగా మింత్రాను నిలుపుతూ, నిత్యం వృద్ధి చెందుతన్న అన్ని వర్గాలకు చెందిన ఫ్యాషన్ ప్రేమికుల అవసరాలను విజయ్ తీరుస్తున్నట్లుగా ఉండే ఈ చిత్ర కథనం మింత్రా కోసం ఆకాంక్షలను రేకెత్తిస్తుంది. మింత్రా నుంచి కొనుగోలుదారులు ఏమి ఆశించవచ్చు, వినూత్నమైన శైలిలను పొందడం, పరిమిత ఎడిషన్స్ మరియు సెలబ్ లుక్స్ సహా అనేక ప్రత్యేకతలు తెలుపడం ద్వారా ఆసక్తిని ఆయన మరింతగా పెంచారు. ఎందుకంటే, ఫ్యాషన్ ప్రేమికులకు ఏ అంశం అయినా తక్కువగా ఉంటే అస్సలు నచ్చదు, వారు మరింతగా , అత్యుత్తమమైనది మాత్రమే కోరుకుంటుంటారు. భారతదేశపు ఫ్యాషన్ నిపుణునిగా మింత్రా ఈ అంశాలలో సహాయపడనుంది! దీనితో పాటుగా ఈ చిత్రంలో మింత్రా యొక్క అసాధారణమైనటువంటి అమ్మకం తరువాత సేవలు అయినటువంటి మార్పిడి, రిటర్న్స్, వాపసు చేయడం వంటి వాటినీ ప్రధానంగా వెల్లడిస్తుంది.
మింత్రాతో ఈ భాగస్వామ్యం మరియు నూతన ప్రచార చిత్రం గురించి సినీ నటుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నాతో సహా నేటి యువత అంతా కూడా ప్రయోగాలు చేయాలనుకుంటుంది. ఫ్యాషన్‌కు సంబంధించి సంప్రదాయ నిబంధనలను అతిక్రమించాలని కోరుకుంటుంది. మింత్రాతో నా భాగస్వామ్యం నా ఈ అభిరుచికి అనుగుణంగా ఉంటుంది. ప్రజల కోసం ఫ్యాషన్‌ను ప్రజాస్వామ్యీకరించడం కోసం నేను వారికి సహకరించాలనుకుంటున్నాను. ఈ బ్రాండ్ కోసం ప్రచారకర్తగా నిలువడం పట్ల నేను చాలా ఆనందంగా ఉన్నాను’’ అని అన్నారు.