Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రీమియం కార్ల తయారీదారు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ శుక్రవారం భారత మార్కెట్లోకి ఆల్ న్యూ 5వ జనరేషన్ హోండా సిటీని విడుదల చేసినట్టు ప్రకటించింది. 1998 జనవరిలో తొలిసారి ప్రవేశపెట్టబడిన హౌండా సిటీ, మధ్యతరహాపరిమాణపు సెడాన్లలో దేశంలో అత్యంత విజయవంతమైందని ఆ కంపనీ పేర్కొంది. ఇప్పటికే 8 లక్షలకు పైగా కస్టమర్లకు సంతోషాలను పంచి ఇచ్చిందని తెలిపింది. బిఎస్6, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్తో దీన్ని ఆవిష్కరించింది. లీటరుకు 17.8 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని పేర్కొంది. కాగా దీని ధరను వెల్లడించలేదు.