Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో స్థానంలోకి సామ్సంగ్
న్యూఢిల్లీ : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ 2021 జూన్ నెల అమ్మకాల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్మార్ట్ఫోన్లను విక్రయించడంతో షావోమీ తొలి స్థానంలో నిలిచిందని డేటా పరిశోధన సంస్థ కౌంటర్‌పాయింట్ వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న సామ్సంగ్ వెనక్కి నెట్టబడింది. కౌంటర్‌పాయింట్ డేటా ప్రకారం ఆఫ్రికా, చైనా, యూరోప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో షావోమీ స్మార్ట్ఫోన్లను విస్తరించడంతో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో గణనీయంగా 26 శాతం పెరగడంతో ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల పరంగా 17.1 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. తర్వాత స్థానంలో 15.7 శాతం వాటాతో దక్షిణ కొరియా కంపెనీ సామ్సంగ్, మూడో స్థానంలో 14.3 శాతం వాటాతో ఆపిల్ నిలి చాయి. ఆఫ్రికా, చైనా, యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో హువావే స్మార్ట్ ఫోన్ వెనక్కి తగ్గడంతో ఆ ప్రాంతాల అమ్మకాల్లో షావోమీ దూసుకెళ్లిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరక్టర్ తరుణ పాఠఖ్ పేర్కొన్నారు.