Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గ్రామీణ ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు ట్రావెల్ ఏజెంట్ల కోసం 'ట్రావెల్ యూనియన్' వేదికను ప్రముఖ నటుడు సోనూసూద్ ఆవిష్కరించారు. ఇది భారత తొలి గ్రామీణ బీ2బీ (బిజినెస్ టూ బిజినెస్) ట్రావెల్ టెక్ ప్లాట్పాంగా నిలువనుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ వేదికపై ఐఆర్సీటీసీ, 500కు పైగా దేశీయ, ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలను, 10,000కు పైగా బస్ ఆపరేటర్లను, 10 లక్షలకు పైగా హౌటల్ సదుపాయాలను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది.
జండూబామ్కు ప్రచారం..
ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఇమామీ లిమిటెడ్ తయారు చేసే జండూ బామ్‌కు నటుడు సోనూసూద్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించు కుంది. ''కోవిడ్‌తో ప్రజలు తీవ్రమైన మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ సమస్యలలో చాలా వాటికి నమ్మకమైన ఆయుర్వేద నొప్పి నివారిణి జండూబామ్ ఉపశమనం అందించింది'' అని ఇమామీ లిమిటెడ్ డైరెక్టర్ మోహన్ గోయెంకా పేర్కొన్నారు.