Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియానీకి ఎదురుదెబ్బ
- అమెజాన్‌కు అనుకూలంగా సుప్రీం తీర్పు
- రిలయన్స్ షేర్ల నేల చూపులు
న్యూఢిల్లీ : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్కు ఊహించలేని విధంగా అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు విషయంలో అమెజాన్‌కు అనుకూలంగా న్యాయమూర్తులు రోహింటన్ ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్, రిలయన్స్,ఫ్యూచర్ రీటైల్ లిమిటెడ్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఫ్యూచర్ రిటైల్‌ను రిలయన్స్ రూ.24,731 కోట్లతో కొనుగోలు చేసింది. కాగా..అమెజాన్ 2019 ఆగస్టులో ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్లలో 49 శాతం వాటాను కొనుగోలు చేసింది. తమ అనుమతి లేకుండా రిలయన్స్ ఇండిస్టీస్ సహా 29 ఇతర సంస్థలతో ఎలాంటి పొత్తు పెట్టుకోకూడదని అమెజాన్ షరతు విధించింది. ఒప్పంద నిబంధనలను అతిక్రమించి ప్యూచర్ రిటైల్, రిలయన్స్ ఒప్పందం చేసుకున్నాయి.దీన్ని తప్పుబడుతూ అమెజాన్ తమకు న్యాయం చేయాల్సిందిగా సింగపూర్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించగా.. అక్కడా అమెజాన్‌కు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఇదే సమయంలో రిలయన్స్ ఢిల్లీ హైకోర్టులో దావా వేయగా.. రిలయన్స్‌కు సానుకూలంగా తీర్పు రాగా.. దీన్ని సవాలు చేస్తూ అమెజాన్ సుప్రీం కోర్టులో దావా వేసింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందాన్ని సుప్రీంకోర్టు తాజాగా నిలిపేస్తూ ఉత్వర్వులిచ్చింది.