Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చే ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో రూ.7500 కోట్ల (ఒక్క బిలియన్ డాలర్లు) పెట్టుబడులకు ప్రణాళికలు వేస్తున్నామని అమర రాజా బ్యాటరీస్ న్యూ ఎనర్జీ వింగ్ ప్రెసిడెంట్ ఎస్ విజయానంద్ తెలిపారు. ముఖ్యంగా లిథియం ఐయాన్ టెక్నలాజీపై దృష్టి పెడుతున్నామన్నారు. ప్రభుత్వ పీఎల్ఐ స్కిమ్లో భాగంగా 10 నుంచి 12 గిగావాట్ లిథియం అయాన్ బ్యాటరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. ప్రస్తుత ప్రతీ ఏడాది సాంప్రదాయ వ్యాపారంపై రూ.400 నుంచి రూ.500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామన్నారు. కాగా.. వచ్చే ఐదేళ్లలో రెవెన్యూ పరంగా 15 నుంచి 17 శాతం వృద్థిని ఆంకాక్షిస్తున్నామన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో రూ.7150 కోట్ల రెవెన్యూ.. రూ.647 కోట్ల నికర లాభాలు ఆర్జించింది