Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వినియోగదారులకు మరింత చేరువ కావడానికి ఒక్క మిస్డ్‌కాల్‌తో నూతన ఎల్పిజి కనెక్షన్‌ను అందిస్తున్నట్టు ఇండేన్ గ్యాస్ తెలిపింది. దేశంలో ఎక్కడి నుంచైనా 8454955555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా నూతన కనెక్షన్‌ను పొందవచ్చని సోమవారం ఆ సంస్థ ఛైర్మన్ ఎస్ఎం వయిద్య తెలిపారు. వినియోగదారులు సులభంగా ఎల్పిజి గ్యాస్ పొందడానికి ఈ సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. అదే విధంగా ఇండియన్ ఆయిల్ వన్ యాప్ ద్వారా కూడా నూతన కనెక్షన్, రీఫిల్, చెల్లింపులు చేయొచ్చన్నారు.