Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టాక్ బ్రోకింగ్ సేవలతో పాటు ఖాతాదారుల ఆర్థిక సేవలను అందించడానికి అనుకూలంగా ఫిన్‌టెక్ ప్లాట్‌ఫాం ఏంజెల్ బ్రోకింగ్ తన పేరును ఏంజెల్ వన్‌గా మార్చుకుంది. ఏంజెల్ వన్ అనేది ఒక వినూత్న, సాధికారత వేదిక అని ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ ప్రభాకర్ తివారీ పేర్కొన్నారు. పరివర్తన అనేది కంపెనీ బ్రాండ్ లెగసీ, ఆశయాల కలయికని తెలిపారు. సంస్థ ప్రతి ఆర్థిక అవసరాల కోసం మ్యూచువల్ ఫండ్స్ నుండి బీమా, ఋణాలు, ఇతర ఆర్థికాంశాల వరకు 'వన్-సొల్యూషన్' వేదికలోకి తీసుకొస్తున్నామన్నారు.