Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2020-21 ముగింపు నాటికి దేశంలో అపార కుబేరుల సంఖ్య 136కు తగ్గిందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరంలో వీరి సంఖ్య 141గా ఉందన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుల ఆధారంగా రూ.100 కోట్ల పైబడిన వారిని కుబేరులుగా పరిగణలోకి తీసుకుంటామని మంత్రి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్‌ల ఆధారంగా 2018-19లో దేశంలో కుబేరుల సంఖ్య 77గా ఉందన్నారు.