Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) 3 శాతం పెరుగుదలతో రూ.109 కోట్ల నికర లాభాలు సాధించినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.106 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.562 కోట్లుగా ఉన్న నికర వడ్డీపై ఆదాయం.. క్రితం క్యూ1లో 14 శాతం పెరిగి రూ.638 కోట్లకు చేరింది. బ్యాంక్ మొత్తం వ్యాపారం 7.4 శాతం పెరిగి రూ.1,16,713 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్ స్థూల నిరర్ధక ఆస్తులు 7.97 శాతానికి తగ్గాయి. గతేడాది ఇదే జూన్ నాటికి 8.34 శాతం ఎన్పీఏలు నమోదయ్యాయి.