Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారు కోల్ ఇండియా లిమిటెడ్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం (2021-22) జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 52 శాతం వృద్ధితో రూ.3,170 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.2,078 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.18,487 కోట్లుగా ఉన్న కంపెనీ రెవెన్యూ క్రితం క్యూ1లో 37 శాతం ఎగిసి రూ.25,282 కోట్లకు చేరింది. కంపెనీ ఉత్పత్తి 123.98 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. గతేడాది ఇదే జూన్ త్రైమాసికంలో 121 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది.