Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ ఫైనాన్సియల్ సేవల సంస్థ సిటీ ఇండియా రిటైల్ బిజినెస్‌ను కొను గోలు చేసేందుకు ఐదు సంస్థలు పోటీ పడుతున్నాయి. దీని స్వాధీ నానికి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, సింగపూర్‌కు చెందిన డిబిఎస్ బ్యాంక్ సహా యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌లు ఆసక్తి కనబర్చుతున్నాయి. ప్రస్తుతం సిటీ బ్యాంక్ ఇండియా రిటైల్ వార్షిక వ్యాపారం రూ.7000 కోట్ల వరకూ ఉందని అంచనా. ఈ ఐదు బ్యాంకులు పోటీపడుతుండగా తదుపరి దశలో షార్ట్‌లిస్ట్‌లో మిగిలే మూడు బ్యాంకర్లతో మెరుగైన డీల్ కోసం సిటీ బ్యాంక్ సంప్రదింపులు జరుపుతుందని సమాచారం.