Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలో అతిపెద్ద మరియు ఎక్కువ మంది విశ్వసించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ , తమ లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను అలా్ట్ర ప్రీమియం శ్రేణి ప్రొజెక్టర్ల ఆవిష్కరణతో శక్తివంతం చేసింది. ద ప్రీమియర్‌గా పిలువబడుతున్న ఈ ప్రొజెక్టర్లు మీకు అతిపెద్ద స్ర్కీన్ ప్రైవేట్ సినిమా అనుభవాలను మీ ఇంటి వద్దనే సౌకర్యవంతంగా అందిస్తుంది. ద ప్రీమియర్, రెండు మోడల్స్‌లో శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ మరియు ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ ప్లాజాల వద్ద ఆగస్టు 10,2021 నుంచి లభ్యమవుతాయి. ఎల్ఎస్పీ9టీ మోడల్ ద ప్రీమియర్ ధర 6,29,900 రూపాయలు కాగా, ఎల్ఎస్పీ7టీ ధర 3,89,900 రూపాయలు. ఈ ప్రొజెక్టర్లు అన్నీ కూడా 12 నెలల వారెంటీతో వస్తాయి.
ఈ ప్రీమియర్, ఆల్ ఇన్ ఒన్ కంపాక్ట్, స్పేస్ సేవింగ్ డిజైన్‌తో వస్తుంది. ఇది వైవిధ్యమైన సెట్టింగ్స్ మరియు అమరికలకు మీ లివింగ్ స్పేస్‌లో మిళితమవుతుంది. ఇది అలా్ట్ర షార్ట్ త్రో ప్రొజెక్టర్ కావడం చేత, ద ప్రీమియర్‌ను కాఫీ టేబుల్ లేదా డ్రాయర్ చెస్ట్‌పై సైతం గోడ నుంచి తగినంత దూరం (11.3 సెంటీమీటర్లు)లో అమర్చడం చేయవచ్చు. తద్వారా అత్యంత నాణ్యత కలిగిన 130 అంగుళాల స్ర్కీన్‌ను వీక్షించవచ్చు. మినమిలిస్ట్ వైట్ డిజైన్, గుండ్రటి అంచులు, సౌందర్య పరంగా ఆహ్లాదంగా నిలిచే ఫ్యాబ్రిక్ ఫినీష్ కలిగిన ద ప్రీమియర్ మీ ఇంటిలో సెంటర్ పీస్‌గా సేవలనందించేందుకు సిద్ధమైంది. చూడగానే ఆకట్టుకునే దీని లుక్కు అదనంగా, ఈ ప్రీమియర్ కంపాక్ట్ మరియు సామాన్యంగా దీని యొక్క అలా్ట్ర షార్ట్ త్రో సామర్థ్యంలతో ఉంటుంది. ఎలాంటి క్లిష్టతరమైన ఇన్స్టాలేషన్ అవసరం లేకుండా మారుతున్న జీవనశైలి మరియు ఇంటీరియర్ డెకార్ ధోరణులను ఋజువు చేస్తుంది. ఈ ప్రీమియర్ మీ ప్రాంగణాలను సమన్వయ పరచడంతో పాటుగా మీ గది యొక్క సౌందర్య విలువకు అదనపు విలువనూ జోడిస్తుంది.
నేటి నుంచి ఆరంభించి, ఈ ప్రీమియర్ 130 అంగుళాలు మోడల్ ఎల్ఎస్పీ9టీ మరియు 120 అంగుళాల స్ర్కీన్ సైజ్ పరిమాణపు మోడల్ ఎల్ఎస్పీ7టీలో లభ్యమవుతుంది. ఇవి లేజర్ శక్తివంతమైన4కె పిక్చర్ రిజల్యూషన్‌కు మద్దతునందిస్తాయి. ప్రీమియర్ ఎల్ఎస్పీ9టీ – ప్రపంచంలో మొట్టమొదటి హెచ్డీఆర్ 10+ సర్టిఫైడ్ ప్రొజెక్టర్. ట్రిపుల్ లేజర్ సాంకేతికత దీనిలో ఉంది. ఇది విప్లవాత్మక కాంట్రాస్ట్ డిటైల్స్‌ను అందిస్తుంది. వినియోగదారులు ప్రకాశవంతమైన చిత్రాలు మొదలు ాకటి చిత్రాల వరకూ గరిష్ట బ్రైట్నెస్ 2800 ఏఎన్ఎస్ఐ ల్యుమెన్స్ (ఓ ప్రొజెక్టర్ నుంచి వెలువడే కాంతి ఔట్‌పుట్‌ను గుణించడానికి అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూట్ నిర్వచించిన యూనిట్)వరకూ అందిస్తుంది. ఇది ఆఖరకు పగటి పూట కూడా ప్రకాశవంతమైన, స్పష్టమైన చిత్రాలకు భరోసా అందిస్తుంది.
ఈ ప్రీమియర్ ఫిలింమేకర్ మోడ్‌కు కూడా మద్దతునందిస్తుంది. ఈ తరహా మొట్టమొదటి ప్రొజెక్టర్‌గా, వినియోగదారులు ఓ చిత్రాన్ని దర్శకునిలా ఆస్వాదించడం చేయవచ్చు. ఈ స్మార్ట్ప్రొజెక్టర్లో శాంసంగ్ యొక్క స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫామ్ ఉంది. దీనిలో పూర్తి శ్రేణిలో స్ట్రీమింగ్ వీడియో యాప్స్, సుప్రసిద్ధ కంటెంట్ భాగస్వాములు అయిన నెట్‌ఫ్లిక్స్., అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మొదలైన వాటి నుంచి ఉంటాయి మరియు మొబైల్ కనెక్టివిటీ ఫీచర్స్ అయినటువంటి ట్యాప్ వ్యూ మరియు మిర్రరింగ్ సైతం ఉన్నాయి. వినియోగదారులు పూర్తిగా లీనమయ్యేటటువంటి, వైవిధ్యమైన గేమింగ్ అనుభవాలను గేమింగ్ మోడ్‌తో 130 అంగుళాల వరకూ స్ర్కీన్ సైజ్ పరిమాణంలో చూడవచ్చు.
ఈ ప్రీమియర్‌లో శక్తివంతమైన, అంతర్గతంగా నిర్మించిన వూఫర్లు మరియు ఎకౌస్టిక్ బీమ్ సరౌండ్ సౌండ్ అనుభవాలు ఉంటాయి. ఇది అత్యుత్తమ సినిమా అనుభవాలను ప్రొజెక్టర్‌తో అందిస్తుంది. అంతేకాదు, అదనంగా అతిపెద్ద సౌండ్ ఎక్విప్మెంట్ను ఇరుకైన గదులలో వినియోగించాల్సిన అవసరమూ తప్పిస్తుంది. ఈ ప్రీమియర్ ఎకౌస్టిక్ బీమ్ సాంకేతికత 40 వాట్లు మరియు 4.2 ఛానెల్ సౌండ్‌ను ఎల్ఎస్పీ9టీ కోసం మరియు 30 వాట్లు , 2.2 ఛానెల్ అనుభవాలను ఎల్ఎస్పీ 7టీ కోసం అందిస్తుంది. దీని అర్థమేమిటంటే, వినియోగదారులు అదనంగా సౌండ్ ఉపకరణాలను వినియోగించాల్సిన అవసరం లేదని. ఎందుకంటే, ప్రొజెక్టర్‌లోనే సౌండ్ అంతర్గతంగా నిర్మించడం వల్ల లివింగ్ స్పేస్ ను థియేటర్ లేదా ఆడిటోరియంగా మార్చవచ్చు.
‘‘ఇంటివద్దనే అధిక సమయం ఇప్పుడు ప్రజలు వెచ్చిస్తున్నారు. దీని కారణంగా ఇంటి లోపల వినోదాన్ని అందించే సాంకేతికతకు ఇటీవలి కాలంలో డిమాండ్ పెరగడాన్ని మేము చూస్తున్నాము. వినియోగదారులు ఈ సాంకేతికతలు ప్రీమియం మరియు వైవిధ్యమైన అనుభవాలను అందించాలని కోరుకుంటున్నారు. ద ప్రీమియర్ ఇప్పుడు గృహ సినిమా అనుభవాలను పూర్తిసరికొత్త కంపాక్ట్ డిజైన్, 4కె చిత్ర నాణ్యత మరియు ఇరుకైన గదులలో భారీ శబ్దాలను అందిస్తుంది. దీనిని గదిలో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, లివింగ్ రూమ్ అమరికలలో , కేబుల్స్ లేదంటే భారీ సెటప్ అవసరం లేకుండానే వినియోగించవచ్చు. ఈ ఆవిష్కరణతో, శాంసంగ్ స్థిరంగా జీవనశైలి ఆడియో–విజువల్ ఉపకరణాలను వినియోగదారుల అవసరాలు మరియు అభిరుచులకు అనుగుణంగా అందిస్తుంది’’ అని రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
ధర, ఆఫర్లు, ఎక్కడ కొనుగోలు చేయవచ్చు
- ప్రీమియర్, రెండు మోడల్స్‌లో శాంసంగ్ యొక్క అధికారిక ఆన్లైన్ స్టోర్ శాంసంగ్ షాప్ మరియు ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ ప్లాజాల వద్ద ఆగస్టు 10,2021 నుంచి లభ్యమవుతాయి. ఎల్ఎస్పీ9టీ మోడల్ ద ప్రీమియర్ ధర 6,29,900 రూపాయలు కాగా, ఎల్ఎస్పీ7టీ ధర 3,89,900 రూపాయలు.
- ఎర్లీ బర్డ్ వినియోగదారులు కాంప్లిమెంటరీ అమెజాన్ ఎకో ప్లస్‌ను ఈ రెండు మోడల్స్‌లో ఏదైనా ఒక దానిని శాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసిన ఎడల పొందవచ్చు. మరిన్ని వివరాలను https://www.samsung.com/in/projectors/the-premiere-2021/ వద్ద పొందవచ్చు.
ఈ ప్రొజెక్టర్లు అన్నీ కూడా 12 నెలల వారెంటీతో వస్తాయి.
ఉత్పత్తి ప్రమాణాలు
డిజైన్: ఆధునిక స్పర్శ కోసం సౌందర్యపరంగా ఆహ్లాదకరమైన ఆకృతి మరియు ఫినీష్ మినిమలిస్ట్ వైట్ డిజైన్‌తో, ద ప్రీమియర్‌ను మీ ఇంటిలో సెంటర్ పీస్‌గా సేవలనందించే రీతిలో డిజైన్ చేశారు. అంతేకాదు, దీని యొక్క గుండ్రటి అంచులు ఫ్యాబ్రిక్ ఫినీష్‌తో కూర్చబడటం చేత హాయిగా మరియు ఆధునిక సరళతను అందిస్తాయి. ఆకర్షణీయమైన దీని లుక్కు తోడుగా, ప్రీమియర్ దీని యొక్క అలా్ట్ర–షార్ట్ త్రో సామర్థ్యాలతో సౌకర్యవంతంగా, సామాన్యమైనదిగా ఉంటుంది. అంటే, గదిలో ఎక్కడా ఇబ్బంది కాకుండా గోడ ముందు కాస్త ఖాళీ స్థలంలో సైతం దీనిని ఉంచవచ్చు. దీని ఇన్‌స్టాలేషన్‌కు ఎలాంటి క్లిష్టమైన ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం లేదు మరియు మారుతున్న జీవనశైలి, ఇంటీరియర్ డెకార్ ధోరణులకు సైతం సరిగ్గా సరిపోతుంది. ఈ ప్రీమియర్ మీ ప్రాంగణాలను మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటుగా మీ గదికి మరింత సౌందర్యమూ తీసుకువస్తుంది.
అత్యద్భుతమైన చిత్ర నాణ్యత: రోజులో ఏ సమయమన్నది సమస్యే కాదు
ద ప్రీమియర్ రెండు మోడల్స్ – ట్రిపుల్ లేజర్ ఆధారిత మోడల్ (ఎల్ఎస్పీ9టీ) మరియు సింగిల్ లేజర్ ఆధారిత మోడల్ (ఎల్ఎస్పీ7టీ) ఉన్నాయి. ఈ ప్రీమియర్, దీని ప్రొజెక్షన్ కలర్ డిస్ప్లేను 147% కు పైగా దీని రంగుల స్వరసప్తకంకు వృద్ధి చేస్తుంది. తద్వారా అసలైన చిత్ర నాణ్యతను జీవితానికి తీసుకువస్తుంది. వినియోగదారులు తమ అభిమాన ప్రతిష్టాత్మక సుందరమైన షాట్స్‌తో పూర్తి ఆధీకృత రెండరింగ్స్ను వినూత్నమైన రంగులు మరియు ప్రకాశవంతమైన టోన్స్‌తో ఆస్వాదించవచ్చు.
పగటి పూట కూడా వినియోగదారులు స్ర్కీన్‌ను ఆస్వాదించడానికి అనుమతిస్తూ, ఈ ప్రీమియర్ అత్యధిక బ్రైట్నెస్ మరియు కాంట్రాస్ట్ రేషియో స్థాయిలను కలిగి ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ 2800 ఏఎన్ఎస్ఐ ల్యుమెన్స్ ప్రకాశాన్ని అందిస్తుంది. ఇది పదునైన చిత్రాన్ని పగటి పూట కూడా అందిస్తుంది. వినియోగదారులు ఎక్కడ కూర్చున్నారనే దానితో సంబంధం లేకుండా, ఈ 4కె స్ర్కీన్ ఏ కోణంలో అయినా కంటెంట్‌ను అద్భుతంగా ప్రదర్శిస్తుంది. అంటే కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఒకేలా ఈ అనుభవాల నుంచి ప్రయోజనం పొందవచ్చు.
ఎలాంటి గోడ వద్దనైనా అతి సులభంగా అమర్చవచ్చు
ప్రొజెక్టర్లను అమర్చడం అనగానే, మీ మనసులో మెదిలే మొదటి అంశం భారీ కేబుల్స్, ఫిక్చర్స్ మరియు ఇతర విడిభాగాలు మెదులుతాయి. అయితే, ఈ ప్రీమియర్ యొక్క ఇన్స్టాలేషన్ ప్లగ్‌లో పవర్ కేబుల్ పెట్టినంత సులభం. వైర్లెస్ నెట్‌వర్క్‌తో దీనిని అనుసంధానించవచ్చు. సంప్రదాయ ప్రొజెక్టర్లకు సాధారణంగా మూడు లేదా నాలుగు మీటర్ల దూరం గోడ నుంచి దూరం పెద్ద స్ర్కీన్ ప్రొజెక్షన్లకు కావాల్సి ఉంటుంది. అయితే, ద ప్రీమియర్ మాత్రం అలా్ట్ర షార్ట్ త్రో ప్రొజెక్టర్. ఇది 11.3 సెంటీమీటర్ల (ఎల్ఎస్పీ9టీ) దూరంలో ఉంచినప్పటికీ 100 అంగుళాల చిత్రం ప్రొజెక్ట్ చేస్తుంది. అదే రీతిలో 30.3 సెంటీమీటర్ల (ఎల్ఎస్పీ7టీ) దూరంలో గోడ నుంచి ఉంచినప్పుడు కూడా 100 అంగుళాల చిత్రం ప్రొజెక్ట్ చేస్తుంది. 130 అంగుళాల డిస్ప్లేను 23.8 సెంటీమీటర్ల (ఎల్ఎస్పీ9టీ) దూరంలో గోడ నుంచి అమర్చడం వల్ల పొందవచ్చు. మీ ఇంటి డెకార్‌కు ఖచ్చితమైన ఫిట్‌గా ఇది నిలుస్తుంది. సరళంగా చెప్పాలంటే, ప్రొజెక్టర్‌ను అమర్చడం కోసం మీ ఇంటి ఇంటీరియర్ డిజైన్‌ను మార్చుకోవడం చేయనవసరం లేదు. ద ప్రీమియర్ కు కావాల్సిందల్లా, అతి సులభంగా అమర్చేందుకు కాస్త సరళమైన అమరిక మాత్రమే. అంతేకాదు, ఈ ప్రీమియర్ కంపాక్ట్ సైజ్‌ను కలిగి ఉంటుంది. అంటే, వినియోగదారులు అతి సులభంగా తమంతట తాముగా ప్రొజెక్టర్‌ను అమర్చుకోవడం లేదా పునరిమిరక చేయడం చేసుకోవచ్చు.
లైవ్ స్టేడియం అనుభవాల కోసం లీనమయ్యే, ఆల్ ఇన్ ఒక్ స్పీకర్
మూడు కోణాలలో, లీనమయ్యే శబ్దాన్ని అదనపు స్పీకర్ల అవసరం లేకుండానే ప్రీమియర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిలోని విస్తృత శ్రేణి శబ్ద వ్యవస్థ దీనికి తోడ్పడుతుంది. దీని కంపాక్ట్ డిజైన్‌లో ఇది అంతర్భాగంగా ఉంటుంది. ఇది 40 వాట్ ప్రీమియం స్పీకర్లను మరియు వూఫర్లను కలిగి ఉంటుంది. ప్రొజెక్టర్లలో నేరుగా నిర్మించడంతో పాటుగా ఎకౌస్టిక్ బీమ్ టెక్నాలజీతో అన్ని కోణాలలోనూ అద్భుతమైన సంగీతాన్ని ఆస్వాదించేలా తోడ్పడనుంది. ఈ ప్రీమియర్‌లో ఎకౌస్టిక్ బీమ్ , వూఫర్లు మరియు ట్వీటర్లు ఉండటంతో పాటుగా మీ వీక్షణ అనుభవాలను మరింతగా వృద్ధి చేయనున్నాయి.
వినోదాన్ని పొందండి మరియు స్మార్ట్ టీవీ ఫీచర్లతో కనెక్ట్ అవండి
ప్రీమియర్, వినియోగదారులకు పూర్తి స్థాయి స్మార్ట్ టీవీ అనుభవాలను అన్ని రకాల కంటెంట్‌ను ఇంటర్నెట్తో కనెక్ట్ చేసినప్పుడు పొందేందుకు అనుమతిస్తుంది. ఒకసారి వినియోగదారులు వైర్లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడంతో పాటుగా మెనూలోకి ప్రవేశించిన వెంటనే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవల నుంచి విస్తృతశ్రేణి కంటెంట్ పొందవచ్చు. అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ పొడకాస్ట్స్ తో పాటుగా యాపిల్ మ్యూజిక్, స్పాటిఫై సైతం పొందవచ్చు. వాయిస్ రికగ్నైజేషన్‌తో తమకు కావాల్సిన కంటెంట్‌ను సైతం వెదకవచ్చు. ఈ ప్రీమియర్ బిక్స్బి, అమెజాన్ అలెక్సా మరియు గుగూల్ అసిస్టెంట్‌తో కూడా పనిచేయడం వల్ల మీ జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
ఈ ప్రీమియర్, ట్యాప్ వ్యూ ఫీచర్‌ను సైతం కలిగి ఉంటుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌పై ప్లే చేసే కంటెంట్‌ను మీ ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించే అవకాశమూ అందిస్తుంది. దీని కోసం ద ప్రీమియర్ సైడ్‌ను మృదువుగా నొక్కితే చాలు. ఒకరు అతి సులభంగా చిత్రాలు లేదా వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్ నుంచి పెద్ద స్ర్కీన్‌కు నేరుగా ప్రొజెక్ట్ చేయవచ్చు. ఈ ప్రీమియర్‌లో గేమింగ్ మోడ్ సైతం ఉంది. ఇది వైవిధ్యమైన గేమింగ్ అనుభవాలను 130 అంగుళాల వరకూ స్ర్కీన్ సైజ్‌లో అందిస్తుంది. అదనంగా, ఓ గేమ్‌ను ఆడుతున్నప్పుడు మీరు మీ గేమింగ్ అనుభవాలను గేమ్ ఎన్హాన్సర్ ఫీచర్‌తో మెరుగుపరుచుకోవచ్చు. ఇది క్లిష్టత లేని కదలికలతో వాస్తవ చిత్రాలను అందిస్తుంది. ప్రీమియం ఆలా్ట్ర షార్ట్ త్రో లేజర్ ప్రొజెక్టర్ శ్రేణి మూడు హెచ్డీఎంఐ పోర్ట్స్ మరియు ఒక యుఎస్బీ పోర్ట్‌తో వస్తుంది. ఇది సౌకర్యవంతమైన కనెక్షన్‌ను గేమింగ్ కన్సోల్కు అందిస్తుంది.