Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో ఎక్కువ మంది విశ్వసించే కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బ్రాండ్, శాంసంగ్ ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని రక్షణ శాఖ ఉద్యోగుల కోసం పూర్తి సరికొత్త కార్యక్రమంతో వేడుక చేయబోతుంది. సర్వీస్‌లో ఉన్న మరియు రిటైర్ అయిన రక్షణ శాఖ ఉద్యోగులు ఇప్పుడు క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) ధరలను శాంసంగ్ టీవీలు, డిజిటల్ అప్లయెన్సస్ అయినటువంటి ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్స్, వాషింగ్ మెషీన్లను ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ ప్లాజా స్టోర్లు, అలాగే క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్డీ) డిపోల వద్ద కొనుగోలు చేసిన ఎడల పొందగలరు.
ఈ కార్యక్రమాన్ని, కొనుగోలు అనుభవాలను వృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రారంభించారు. వీటి ద్వారా విస్తృత శ్రేణి శాంసంగ్ ఉత్పత్తులను రక్షణ శాఖ ఉద్యోగులు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన శాంసంగ్ స్మార్ట్ ప్లాజాల వద్ద పొందవచ్చు. శాంసంగ్ స్మార్ట్ ప్లాజాలు ఇప్పుడు ప్రత్యేకమైన మరియు పూర్తి శ్రేణి కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ మరియు శాంసంగ్ ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్స్ (ఎస్ఈసీలు)ను ఈ స్టోర్స్ అన్నింటి వద్ద అందించడంతో పాటుగా వినియోగదారులు ప్రత్యక్ష డెమోలు పొందగలరనే భరోసా అందిస్తూనే ఆ ఉత్పత్తుల ఫీచర్లను సవివరంగా అర్ధం చేసుకునేందుకు తగిన అవకాశాలనూ కల్పించనుంది. ‘‘రాబోతున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, శాంసంగ్ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని సీఎస్డీ ప్రయోజనాలను రక్షణ శాఖ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు శాంసంగ్ స్మార్ట్ ప్లాజాల వద్ద అందించడం కోసం సృష్టించింది. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన, ఈ కార్యక్రమం ద్వారా, రక్షణ శాఖ ఉద్యోగులకు షాపింగ్ సౌకర్యం పెంపొందించడంతో పాటుగా అతి సన్నిహిత బ్రాండ్ అనుభవాలను వృద్ధి చేయడం లక్ష్యంగా చేసుకున్నాము. మా వినూత్నమైన ఉత్పత్తులు మరియు సేవల ద్వారా వారి జీవితాలకు అదనపు విలువను జోడించగలమని మేము ఆశిస్తున్నాము’’ అని రాజు పుల్లన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ బిజినెస్, శాంసంగ్ ఇండియా అన్నారు.
వినియోగదారులతో పాటుగా ఉద్యోగుల భద్రతకు భరోసానందిస్తూ, అన్ని శాంసంగ్ స్మార్ట్ ప్లాజాలు ప్రభుత్వ శానిటైజేషన్, భౌతిక దూర మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. ఏ సమయంలో అయినా పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులను స్టోర్ లోపలకు అనుమతిస్తారు. తద్వారా భౌతిక దూర నిబంధనలు పాటిస్తున్నామనే భరోసానూ అందిస్తారు. డిజిటల్, కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల విధానం వినియోగించాల్సిందిగా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నారు మరియు స్వైపింగ్ మెషీన్లను వినియోగదారులకు అందజేసే ముందుగా వాటిని శానిటైజ్ చేయడమూ జరుగుతుంది. తద్వారా స్మార్ట్ ప్లాజాల వద్ద అత్యున్నత ప్రమాణాలను నిర్వహిస్తున్నామనే భరోసానూ అందిస్తున్నారు.