Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్ వెల్లడి
చెన్నయ్ : సమగ్రమైన క్యాన్సర్ నిరోదక చికిత్సలను అందించడం కోసం దక్షిణ ఆసియాలోనే తొలి స్పెసిఫిక్ రోబోటిక్ ఆంకాలజీ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు అపోలో ప్యాట్రన్ క్యాన్సర్ సెంటర్ (ఎపిసిసి) తెలిపింది. చెన్నయ్‌లోని తమ హాస్పిటల్లో అధునాతనమైన నాలుగోతరం 'డావిన్సీ సర్జికల్ సిస్టమ్-ఎక్స్ఐ'తో, అంకితభావం కలిగిన వైద్య బందంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ సర్జరీలో మానవ హస్తాలు వాటికి సాటిరావని, ఇన్ఫెక్షన్లు వచ్చే సందర్భాలను తగ్గిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. శస్త్రచికిత్సలో ఖచ్చితత్వాన్ని పెంచుతుందని, ఆసుపత్రిలో రోగులు ఉండే వ్యవధిని తగ్గిస్తుందని తెలిపింది. ప్రతి ఆంకాలజీలోనూ రోబోటిక్ సర్జరీలో అత్యంత సమర్థులైన నిపుణులు అపోలో ప్యాట్రన్ క్యాన్సర్ కేంద్రంలో ఉన్నారని అపోలో ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు.