Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడీస్ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారత్ సహా ఆసియాలోని బ్యాంక్‌ల ఆస్తుల (రుణాల) నాణ్యత రిస్కులో ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ పేర్కొంది. కరోనా వైరస్ నూతన కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడమే ఇందుకు కారణమని పేర్కొంది. అయినప్పటికీ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్న విధానాలు, మూలధన నిల్వల వల్ల బ్యాంక్‌లు ప్రతికూలతలను అధిగమించనున్నాయని పేర్కొంది. కరోనా, లాక్డౌన్ కఠిన నిబంధనలు ఆర్థిక వ్యవస్థ రికవరీ వేగాన్ని తగ్గించాయని, అదేవిధంగా రుణ గ్రహీతల రుణ చెల్లింపు సామర్థ్యం పడిపోయిందని దీంతో ఆస్తుల నాణ్యతలో రిస్కు పెరిగిందని మూడీస్ తెలిపింది. 2022 మార్చి కల్లా ఆర్థిక వ్యవస్థ రికవరీలోకి రానుందని అంచనా వేసింది. కాగా అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు పలు ఆర్థిక వ్యవస్థలకు మద్దతును ఇవ్వనున్నాయని పేర్కొంది.