Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వ్యక్తిగత సురక్షతకు కట్టుబడిన గార్డియన్స్ యాప్‌ను ట్రూకాలర్ సృష్టికర్తలైన ట్రూ సాఫ్ట్వేర్ స్కాండినేవియా ఎబి యాజమాన్యం అభివృద్ధిపరచగా, నేడు దానికి కొత్త అప్డేట్లను ప్రకటించింది మరియు ప్రపంచ వ్యాప్తంగా 1 మిలియన్ డౌన్లోడ్లతో గమనార్హమైన మైలు రాయిని చేరుకుంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలో లభిస్తుంది. లక్షలాది డౌన్లోడ్లలో భారతదేశం 60% వాటాను కలిగి ఉంది. ఈ ఏడాది మార్చిలో విడుదల అనంతరం విజయాన్ని దక్కించుకున్న ఈ యాప్‌కు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల నుంచి ఉత్తేజనకరమైన ప్రతిస్పందన లభించిన తరువాత గార్డియన్స్ ఇప్పుడు హిందీ, అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్ మరియు ఇండోనేషియా భాషలతో పాటు, పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్‌కు గూగుల్ ప్లే స్టోర్‌లో 4.5 స్టార్ల రేటింగ్‌ను దక్కించుకుంది మరియు మ్యాప్స్ మరియు నేవిగేషన విభాగంలో టాప్ 10 యాప్‌లలో ఒకటిగా ఉంది.
ఇందులో ప్రత్యేకతలు: స్యాటిలైట్ వ్యూ- వినియోగదారులు ఇప్పుడు స్యాటిలైట్ వ్యూ ఆన్ చేసుకోవచ్చు మరియు నికర భౌగోళిన వివరాలతో భూమిపై వాస్తవ రూపురేఖల పటాన్ని చూడవచ్చు. మ్యాప్ వ్యూ తరహాలోనే ఉపగ్రహ చిత్రాన్ని కూడా గూగుల్ నుంచి అందిస్తుంది. వినియోగదారులు స్యాటిలైట్ మరియు డిఫాల్ట్ వ్యూ మధ్య మధ్య ప్రొఫైల్> అడ్వాన్స్‌డ్‌తో మార్చుకోవచ్చు.
లొకేషన్ బేస్డ్ అలర్ట్‌లు- ఈ ప్రత్యేకతతో ఈ యాప్‌ను వినియోగించుకునే వారు తాము ఎక్కువగా ఉండే స్థలాలైన ఇల్లు, విద్యా సంస్థ లేదా ఉద్యోగం చేసే స్థలాలను గుర్తించేందుకు అవకాశం కల్పిస్తుంది మరియు ఈ ‘సురక్షిత’ స్థలం నుంచి బయటకు వెళ్లిన సమయంలో గార్డియన్స్‌కు దీని గురించి సూచన ఇవ్వవచ్చు. ఈ యాప్‌కు రానున్న కొన్ని అప్డేట్లో వినియోగదారులకు ఆటోమేట్ చేసేందుకు కూడా అవకాశాన్ని కల్పిస్తుంది, అంటే ఇల్లు విడిచి బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా లొకేషన్ ప్రారంభించడం ద్వారా బ్యాటరీని ఆదా చేస్తుంది.
యాక్టివిటీ బేస్డ్ అలర్ట్‌లు- ఈ ప్రత్యేకత ఎంపిక చేసుకోదగినది కాగా, వినియోగదారులు వారు వినియోగించుకోవాలని కోరుకుంటే, ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవచ్చు. యాక్టివిటీ బేస్డ్ అలర్ట్‌లు మీ కార్యక్రమాల ఆధారంగా ఉంటాయి మరియు ఆండ్రాయిడ్ యాక్టివిటీ రికగ్నైజేషన్ ఎపిఐ వినియోగించుకుంటుంది. గార్డియన్స్ యాప్స్ తక్షణమే మీరు నడుస్తున్నప్పుడు లేదా డ్రైవింగ్ చేస్తున్న సమయంలో అప్రమత్తమై సూచనలను పంపిస్తుంది. ఇది వేగాన్ని ఆధారంగా చూసుకుని అలర్ట్‌లను పంపించడాన్ని సాధ్యం చేస్తుంది. అంటే, మీరు నడవడం/ పరుగు ప్రారంభించినప్పుడు, లేదా గంటకు 50 కి.మీ. కన్నా వేగంగా వాహనాన్ని నడుపుతుంటే, అలర్ట్ చేస్తుంది. ప్రజలను వారి డిజిటల్ జీవితాల్లో రక్షణ కల్పించే ఈ యాప్ అభివద్ధి పరచిన తరువాత ట్రూకాలర్ వాస్తవ-ప్రపంచం సురక్షతకు కట్టుబడి ఉంది. బ్రాండ్‌గా ప్రతి ఒక్కరూ మరియు వారికి ఇష్టమైన వారు సురక్షితంగా ఉండాలని ధృవీకరించేందుకు స్థానిక ప్రభుత్వ అధికారులతో పని చేసేందుకు కట్టుబడి ఉన్నాము. గార్డియన్స్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకునేందుకు లభిస్తుంది.
మా భరోసా: గార్డియన్స్ ఎప్పటికీ ఏ ఇతర థర్డ్ పార్ట్ వ్యక్తుల యాప్‌లకు వాణిజ్య వినియోగానికి తనదే అయిన ట్రూకాలర్ యాప్‌తో కలిపి ఎవరికీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోదు. ఇది వ్యక్తిగత సురక్షతకు మా నిబద్ధతతకు ప్రతీకగా ఉంది.
గార్డియన్ గురించి: గార్డియన్ ట్రూకాలర్ సృష్టికర్తలైన ట్రూ సాఫ్ట్వేర్ స్కాండినేవియా ఎబి యాజమాన్యం మరియు అభివృద్ధితో వ్యక్తిగత సురక్షతల యాప్‌గా ఉంది. ట్రూకాలర్ ప్రపంచ వ్యాప్తంగా 280 మిలియన్ల క్రియాశీలక వినియోగదారులకు నిత్యం కమ్యూనికేషన్లో అవిభాజ్య అంగంగా ప్రారంభం నుంచి సగం బిలియన్కు పైగా ఎక్కువ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గార్డియన్స్ ఉచితం కాగా, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న రెండు మొబైల్ ప్లాట్‌ఫారాల్లో పని చేస్తుంది మరియు వ్యక్తిగత సురక్షతకు మరియు సులభంగా వినియోగించుకోవడాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. ట్రూ సాఫ్ట్వేర్ స్కాండినేవియా ఎబి స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. దీన్ని 2009లో అలన్ మమెడి మరియు నమి ఝరింపలమ్ నెలకొల్పారు. పెట్టుబడిదారుల్లో సెక్వియా క్యాపిటల్, అటోమికో మరియు క్లీనర్ పర్కిన్స్ తదితరాలు ఉన్నారు.