Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి డిజైన్, ఫ్యాషన్ మరియు మీడియా సంస్థ పెరల్ అకాడమి నేడు ‘పెరల్ ఎక్స్ స్టూడియో’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించగా, ఇది అన్ని వయసుల వారికి వేగవంతమైన సృజనశీల కోర్సులను అందిస్తుంది. పెరల్ ఎక్స్ స్టూడియో ద్వారా మీడియా, ఫ్యాషన్ మరియు ప్రదర్శన కళల్లో 40 కోర్సులు అందిస్తుండగా, అందులో ‘ఫ్యాషన్ డిజైన్-ఉమెన్స్ వేర్’, ‘స్టైలింగ్ ఫర్ ఇంటీరియర్’, ‘పర్సనల్ స్టైలింగ్ అండ్ ఇమేజింగ్ కన్సల్టెన్సీ’, ‘ఫ్యాషన్ అండ్ సెలబ్రిటీ మేకప్’, ‘పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్’ ‘ప్రొఫెషనల్ ఫొటోగ్రఫి’, ‘సోషియల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్’, ‘అడ్వర్టైజింగ్ అండ్ గ్రాఫిక్స్’, ‘ప్రొఫెషనల్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పీరియెన్స్ మేనేజ్మెంట్’ తదితరాలు ఉన్నాయి. హైబ్రిడ్-ఆఫ్‌లైన్/ఆన్లైన్ మోడల్లో అందిస్తుండగా 3 నెలల కోర్సులు పూర్తి చేసి, ప్రమాణ పత్రాలు పొందవచ్చు లేదా 12 నెలల అవధికి నాలుగు కోర్సులను కలిపి క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ (ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్) ద్వారా డిప్లమో పట్టా పొందవచ్చు.
ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్సులను మౌలిక దశ నుంచి మెరుగైన దశ వరకు కేవలం మూడు నెలల్లో నేర్చుకునేలా డిజైన్ చేశారు. ‘పెరల్ ఎక్స్ స్టూడియో’ వృత్తి ప్రపంచంలోని అవసరాలకు అనుగుణంగా ఈ కోర్సుల్లో బోధించేందుకు పరిశ్రమలోకి నాయకులతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. పెరల్ ఎక్స్ స్టూడియో ప్రారంభించడం గురించి పెరల్ అకాడమి అధ్యక్షుడు అదితి శ్రీవాత్సవ ‘‘పెరల్ ఎక్స్ స్టూడియో ద్వారా మేము పెరల్ అకాడమి రేపటి సృజనశీల వృత్తి నిపుణులను తయారు చేసే శ్రీమంతమైన పరంపరను విస్తరిస్తున్నాము. అన్ని వయసుల వారిలోనూ ప్రతిభ మరియు మహత్వాకాంక్షలను ఎటువంటి కొరత లేకుండా వారికి సరైన విద్యా పరమైన మద్ధతు ఇస్తే వారి కలలను నెరవేర్చుకుని, తమ రంగంలో దృఢంగా నిలదొక్కుకోగలుగుతారు. ‘పెరల్ ఎక్స్ స్టూడియో’తో పలు పరిశ్రమల నాయకులు ఈ కోర్సుల సహ-సృష్టి మరియు సహ-ప్రమాణీకరణానికి భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం, మరియు కౌశల్యం కలిగిన వర్క్‌ఫోర్స్ అవసరం ఎక్కువగా ఉన్నదనేందుకు సాక్ష్యంగా ఉంది మరియు మేము చేస్తున్న ఈ ప్రయత్నం డిమాండ్-సరఫరా మధ్య అంతరాలను భర్తీ చేస్తుందని’’ వివరించారు.
పెరల్ ఎక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో పరిశ్రమలోని ప్రముఖుల్లో ఒకరైన డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్, నిర్మాత మరియు దర్శకుడు కేతన్ దేశాయి మరియు ఫ్యాషన్ డిజైనర్ అంజు మోది తదితరులు ‘లాభదాయకమైన సృజనశీలత ఉన్న ఉద్యోగుల అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం’’ గురించి చర్చించారు. వారితో గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ ఆసియా పసిఫిక్ సీఈఓ శరద్ మెహ్రా, పెరల్ అకాడమి అధ్యక్షుడు అదితి శ్రీవాత్సవ, స్కూల్ ఆఫ్ కాంటెంపరరీ మీడియాకు చెందిన డీన్ వివేక్ వాస్వాని మరియు స్కూల్ ఆఫ్ ఫ్యాషన్‌కు చెందిన డీన్ మౌరిఝియో గ్రియోలీ ఉన్నారు. వారు సృజనశీల రంగాల్లో వృత్తినైపుణ్య శిక్షణ ప్రాముఖ్యత, కౌశల్య ఆధారిత ఉద్యోగ అవకాశాల భవిష్యత్తు మరియు ప్రతిభ మరియు అర్హతల్లో ఏది ముఖ్యమో వివరించారు.
ఏడాది మొత్తం ప్రవేశాలకు అవకాశం ఉండడంతో, కోర్సులు చేసేందుకు అనుకూలకరంగా ఉండే పెరల్ ఎక్స్ స్టూడియో అధీకృతంగా అక్టోబరు 2021లో తన మొదటి బ్యాచ్‌ను ప్రారంభించనుంది. అంతర్జాతీయ సిబ్బంది, వృత్తినిపుణులు మరియు పరిశ్రమలోని అనుభవంతో ‘పెరల్ ఎక్స్ స్టూడియో కోర్సుల్లో ‘క్యాప్‌స్టోన్’ ప్రత్యేక అంశంగా ఉంది. ‘క్యాప్‌స్టోన్’ ద్వారా ప్రవేశాన్ని పొందిన వ్యక్తులను 2 వారాలు పరిశ్రమకు చెందిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు మార్గదర్శనం ఇస్తారు. వారు పెరల్ ఎక్స్ స్టూడియో డిప్లమోతో ప్రత్యేక ‘క్యాప్‌స్టోన్ సర్టిఫికేషన్’ కూడా పొందుతారు. పెరల్ ఎక్స్ స్టూడియో వ్యక్తులను వారి కోర్కెలను అనుసరించేందుకు తయారుగా ఉంచుతుంది మరియు వారికి వారి సృజనశీలత ఆవిష్కరించేందుకు మరియు సరైన సామర్థ్యానికి నేతృత్వం వహిస్తోంది.