Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: భారతదేశంలో సుప్రసిద్ధ జీవిత భీమా కంపెనీలలో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్ తమ సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, నాన్ పార్టిస్పేటింగ్ ప్రొడక్ట్, హెచ్డీఎఫ్సీ లైఫ్ సరళ్ పెన్షన్‌ను విడుదల చేసింది. ఇది జీవితాంతపు యాన్యుటీ రేట్లను ప్లాన్ కొనుగోలు సమయంలోనే అందిస్తుంది.
ప్రామాణిక, వ్యక్తిగత, తక్షణ యాన్యుటీ ఉత్పత్తి హెచ్డీఎఫ్సీ లైఫ్ సరళ్ పెన్షన్. అతి సరళమైన ఫీచర్లు మరియు ప్రామాణిక నియమ నిబంధనలు కలిగి ఉన్న ఈ ప్లాన్‌తో వినియోగదారులు తమ రిటైర్మెంట్ ప్రణాళికలను పూర్తి సమాచారయుక్తంగా చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు:
- వైద్య పరీక్షలను చేయించుకోనవసరం లేదు
- సింగిల్ ప్రీమియం చెల్లింపు
- జీవితం కోసం పూర్తి హామీతో ఆదాయ వనరును అందిస్తుంది
- జాబితాలోని క్రిటికల్ ఇల్నెస్* లలో ఏదైనా ఒక దానిని యాన్యుటెంట్ భార్య/భర్త లేదా పిల్లలు లేదా స్వయంగా బాధపడుతున్నారని గుర్తించిన వెంటనే సరెండర్ చేసే అవకాశం
- మరణం సంభవించిన ఎడల కొనుగోలు ధర తిరిగి చెల్లించబడుతుంది
- భారీ కొనుగోలు ధరపై అత్యధిక వార్షిక యాన్యుటీ రేట్ల ప్రయోజనం
- పాలసీ ఋణాలు లభ్యం
- సరెండర్ ఆమోదం తరువాత, కొనుగోలు ధరలో 95%ను పన్నులు మినహాయించి యాన్యుటెంట్కు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఋణ మొత్తం ఏమైనా ఉంటే బకాయితో పాటుగా వడ్డీ మొత్తాలు కూడా మినహాయించబడతాయి.
భారతదేశంలో సామాజిక భద్రత లోపం కారణంగా యాన్యుటీ అనేది అతి ముఖ్యమైన ఉత్పత్తి విభాగంగా నిలుస్తుంది. రిటైర్మెంట్ తరువాత కూడా తరచుగా ఆదాయం అందుకోవడంలో ఓ వ్యక్తికి ఇది అవకాశం కల్పిస్తుంది. జీవిత కాలం పెరగడం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాల వృద్ధి మరియు న్యూక్లియర్ ఫ్యామిలీల ధోరణి పెరుగుతుండటం వంటి కారణాలన్నీ కూడా రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. రిటైర్మెంట్ తరువాత కూడా సౌకర్యవంతమైన జీవితం జీవించాలనుకునే వారికి యాన్యుటీ ప్లాన్స్ భరోసాను అందిస్తాయి.
ఈ ఆవిష్కరణ సందర్భంగా శ్రీనివాసన్ పార్థసారధి, చీఫ్ యాక్చ్యురీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ మాట్లాడుతూ ‘‘రిటైర్మెంట్ వయసుకు దగ్గరగా వయసు ఉండటం లేదంటే రిటైర్ అయిన వ్యక్తులకు తగిన పథకాలు యాన్యుటీ ప్లాన్స్. జీవితంలో ఎదురయ్యే అనిశ్చితి మరియు పడిపోతున్న వడ్డీరేట్ల నుంచి భద్రతను ఈ ప్లాన్స్ అందిస్తాయి. ఈ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేసిన వెంటనే రెగ్యులర్ చెల్లింపులను అందుకోవడం ప్రారంభించవచ్చు. ఇది స్థిరంగా, రెగ్యులర్ ఆదాయాన్ని లాక్డ్ ఇన్ యాన్యువిటీ రేట్లతో తమ జీవితాంతం పొందేందుకు భరోసా అందిస్తుంది. అతి సరళమైన మరియు అతి సులభంగా అర్థం చేసుకోతగిన ఉత్పత్తి హెచ్డీఎఫ్సీ సరళ్ పెన్షన్. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇది ఉపయుక్తమైన ఇన్‌స్ట్రుమెంట్‌గా నిలువనుంది. వినియోగదారులు దీని నుంచి అధికంగా ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాము’’అని అన్నారు. ఒకరు ఏ విధంగా యాన్యుటీ అందుకోవాలనుకుంటున్నారో దానిని ఎంచుకునే అవకాశాన్ని హెచ్డీఎఫ్సీ లైఫ్ సరళ్ పెన్షన్ అందిస్తుంది. ఈ యాన్యుటీని నెలవారీ, త్రైమాస, అర్థ సంవత్సర లేదా వార్షిక పద్ధతిలో అందుకోవచ్చు. అంతేకాదు, తమ భర్త/భార్య కోసం తమ ప్రయోజనాలను విస్తరించాలనుకునే వారికి ఉమ్మడి జీవితపు అవకాశాలు సైతం ఈ ప్లాన్‌లో చక్కగా పనిచేస్తాయి.
హెచ్డీఎఫ్సీ లైఫ్ గురించి:
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (హెచ్డీఎఫ్సీ లైఫ్/కంపెనీ) , భారతదేశపు సుప్రసిద్ధ ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మరియు అంతర్జాతీయ పెట్టుబడుల కంపెనీ స్టాండర్డ్ లైఫ్ అబెర్డీన్ల ఉమ్మడి సంస్థ. 2000వ సంవత్సరంలో ప్రారంభమైన హెచ్డీఎఫ్సీ లైఫ్, భారతదేశంలో సుప్రసిద్ధ దీర్ఘకాలిక జీవిత భీమా పరిష్కారాల ప్రదాత. ఇది వ్యక్తిగత మరియు గ్రూపు భీమా పరిష్కారాలను విభిన్నమైన వినియోగదారుల అవసరాలు అయినటువంటి రక్షణ, పెన్షన్, పొదుపు, పెట్టుబడి, యాన్యుటీ, ఆరోగ్యం వంటి వాటిని తీరుస్తుంది. జూన్ 30,2021 నాటికి ఈ కంపెనీకి 37 వ్యక్తిగత, 13 గ్రూప్ ప్రొడక్ట్స్ జాబితా ఉంది. వీటితో పాటుగా 7 ఆప్షనల్ రైడర్ ప్రయోజనాలు సైతం ఉన్నాయి. ఇవి విభిన్న శ్రేణి వినియోగదారుల అవసరాలు తీరుస్తాయి.
దేశవ్యాప్తంగా తమ విస్తరించిన ఉనికి చేత హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రయోజనం పొందుతుంది. దేశవ్యాప్తంగా సంస్థకు 390 శాఖలు మరియు అదనపు డిస్ట్రిబ్యూషన్ టచ్ పాయింట్లు పలు నూతన భాగస్వామ్యాలు మరియు ఒప్పందాల ద్వారా కలిగి ఉంది. మా భాగస్వామ్యాల సంఖ్య 300. వీటిలో సంప్రదాయ భాగస్వామ్యాలైనటువంటి ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐ, ఎస్ఎఫ్బీలు మరియు నూతన పర్యావరణ వ్యవస్థ భాగస్వాములు ఉన్నారు. ఈ కంపెనీకి శక్తివంతమైన ఫైనాన్షియల్ కన్సల్టెంట్లు సైతం ఉన్నారు.