Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్కోడా ఆటో ఇండియా కొత్తగా లాంచ్ చేయబడిన 1.5L TSI-శక్తి కలిగిన కుషాక్ కస్టమర్ డెలివరీలు నేటి నుండి ప్రారంభించింది. ఈమధ్యనే 28 జూన్ 2021 న లాంచ్ చేయబడిన కుషాక్ కస్టమర్ల నుండి అత్యధికమైన స్పందన అందుకుంది. ఈ 1.5L TSI-శక్తి కలిగిన కుషాక్ భారతదేశం అంతటా విస్తరించిన అన్ని స్కోడా ఆటో షోరూములలో టెస్ట్ డ్రైవ్స్ మరియు సేల్స్ కు లభిస్తుంది.
శక్తివంతమైన మరియు సమర్థమైన 1.5L TSI ఇంజన్, వోల్క్సువేగన్ గ్రూపు యొక్క గ్లోబల్ స్థాయిలో ప్రశంసించ బడుతున్న లేటెస్ట్ జనరేషన్ EVO సీరీస్ లోనిది మరియు దీనిలోని ఫస్ట్-ఇన్-సెగ్మంట్ ఫీచర్: యాక్టివ్ సిలిడర్ టెక్నాలజీ (ACT). ఇంజన్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ACT ఆటోమేటిక్ గా రెండు సిలిండర్లును షట్ డౌన్ చేసి, దీని ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఫోర్-సిలిండర్ ఇంజన్ యొక్క సిలిండర్ బ్లాక్స్ అన్నీ ప్లాజ్మ-కోటెడ్. సిలిండర్ లైనర్స్ మీద అప్లై చేసిన ఇన్నొవేటివ్, థిన్, పౌడర్-కోటెడ్ లేయర్ కేవలం 150 μm (0.15 mm) మెజర్మంట్ కలిగి ఉంటుంది. ఇది ఇంటర్నల్ ఫ్రిక్షన్ ను తగ్గించి, దాని ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. ఇది ఇంకా ఇంజన్ మీద థర్మల్ లోడ్ ని కూడా తగ్గించి, కంబస్టర్ ఛాంబర్ లో మెరుగైన డిస్ట్రిబ్యూషన్ మరియు హీట్ క్షీణతకు సహకరింస్తుంది.
ఈ TSI ఇంజన్, దీని 1.5L డిస్ప్లేస్మెంట్ తో 110 kW (150 PS) @ 5000-6000 rpm పవర్ ఔట్ పుట్ మరియు 250 Nm @ 1600-3500 rpm టార్క్ అందజేస్తుంది. ఈ ఇంజన్ ను 6-స్పీడ్ మాన్యువల్ గియర్ బాక్స్ తో గానీ లేదా ఫ్యాడల్ షిఫ్టర్స్ తో అందించబడిన 7-స్పీడ్ DSG తో గానీ పెయిర్ చేయవచ్చు. ఈ గెయిర్ రేషియోలు, క్లాస్ లీడింగ్ మైలేజ్ తో పాటు స్పోర్టినెస్ మరియు కంఫర్ట్ యొక్క పెర్ఫక్ట్ బ్లెండ్ అందజేస్తాయి. కుషాక్, మాన్యువల్ ట్రాన్సుమిషన్ కు 17.95 కె.ఎమ్.పి.ఎల్ మరియు ఆటోమేటిక్ వారియంట్ (ARAI సర్టిఫైడ్) కు 17.71 కె.ఎమ్.పి.ఎల్ మైలేజ్ అందిస్తుంది.
దీని మీద కామెంట్ చేస్తూ, శ్రీ జాక్ హజ్ఞలిస్, బ్రాండ్ డైరెక్టర్, స్కోడా ఆటో ఇండియా ఇలా ఇన్నారు, "మా కస్టమర్లకు 1.5L TSI కుషాక్ డెలివరీలు ప్రారంభిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 1.5L TSI ఇంజను 17.95 కె.ఎమ్.పి.ఎల్ ఇంధన సామర్థ్యంతో 150 PS మరియు 250 Nm టార్క్ అందజేయ కలుగుతుంది అన్న ఫ్యాక్ట్ ఈ TSI యొక్క పవర్ మరియు టెక్నికల్ గా అడ్వాన్స్ చెందిన ACT సిస్టమ్ యొక్క నమ్మశక్యంకాని టెస్టమెంట్. కుషాక్ స్పెషల్ గా ఇండియా లో డిజైన్ చేసి, నిర్మించబడినది. ఈ కారుకు ఇండియా అంతటా పెరుగుతున్న ఔట్ స్టాండింగ్ రెస్పాన్స్ చూసి, మేము ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. మరింత మంది కస్టమర్లు మా షోరూమ్స్ కు విచ్చేసి, ఈ వెహికిల్స్ ను టెస్ట్ డ్రైవ్ చేయవలసిందిగా మేము వారిని కోరుతున్నాం.’