Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌కేర్ మరియు హెల్త్‌కేర్ ఉత్పత్తుల్ని సొంతంగా తయారు చేసుకోవాలన్న ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దూసుకుపోతున్న భారతదేశానికి మద్దతుగా నిలిచింది Wipro GE హెల్త్ కేర్. అందులో భాగంగా దేశంలో అల్ట్రాసౌండ్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న Wipro GE ఇప్పుడు స్థానికంగా మరిన్ని Versana ఉత్పత్తుల్ని భారతదేశంలో తయారు చేసేందుకు సిద్ధమైంది. సప్లయర్ ఎకో సిస్టమ్ మరియు స్థానిక ఉత్పత్తుల తయారీని మరింత పెంపొందించాలనే లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కంపెనీ ఉత్పత్తుల్లో భాగమైన Versana అల్ట్రాసౌండ్ ఉత్పత్తుల్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన బెంగళూరులోని కడుగొడి ఉత్పత్తి కేంద్రంలో తయారు చేస్తారు.
ఈ సందర్భంగా Wipro GE హెల్త్ కేర్, సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శ్రవణ్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... స్థానికంగా మేం తయారు చేయబోతున్న ఈ ఉత్పత్తుల ద్వారా Versana దిగుమతులు సగానికి సగం తగ్గిపోతాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమాలు రూపొందించక ముందు Wipro GE హెల్త్‌కేర్ 1992 నుండి భారతదేశంలో అల్ట్రాసౌండ్లు మరియు ఇతర మెడ్‌టెక్ పరికరాలను తయారు చేస్తోంది. ఇప్పుడు ఈ స్థానిక తయారీతో కష్టతరమైన సంరక్షణ పరికరాల లభ్యతను వేగంగా ట్రాక్ చేయవచ్చు. ధర కూడా తగ్గి, ఆ ప్రయోజనం వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది అని అన్నారు ఆయన.
"2021 చివరి నాటికి, OB / GYN, రేడియాలజీ, కార్డియాలజీ, అనస్థీషియా, అత్యవసర మరియు క్లిష్టమైన సంరక్షణ విభాగాలకు కావాల్సిన ఏడు అల్ట్రాసౌండ్ ఉత్పత్తులను స్థానికంగా తయారు చేసుకోవాలన్నదే మా ధ్యేయం అని అన్నారు ఆయన.
దేశంలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే పనిలో భాగంగా30 ఏళ్ల Wipro GE హెల్త్‌కేర్ మరియు ఇండియాటింప్రోవ్ జాయింట్ వెంచర్ కృషి చేస్తోంది. అల్ట్రాసౌండ్ పరికరాల డిమాండ్ దేశవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా చిన్న పట్టణాల్లో పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని... ఆ అవసరాన్ని తీర్చే విధంగా సంస్థ సహాయపడుతుంది. ప్రస్తుతం Versana అల్ట్రాసౌండ్ పరికరాన్ని... మన దగ్గరున్న సప్లై చెయిన్ ఎకో సిస్టమ్ ద్వారా కేవలం 1.5 గంటల సమయంలో రూపొందించవచ్చు. తద్వారా వినియోగదారుల అవసరాలు త్వరగా తీరేందుకు అవకాశం ఏర్పడుతుంది.
"ప్రస్తుతం హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ కు అల్ట్రా సౌండ్ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తోంది. అంటే రోగి డేటా మరియు విజువలైజేషన్లో అల్ట్రాసౌండ్ కీలక పాత్ర పోషిస్తుంది. రోగులకు మెరుగైన క్లినికల్ ఫలితాలను అందించేందుకు, అలాగే మరింత సమాచారం తెలుసుకునేందుకు ఇది సహాయపడుతుంది. Versana, LOGIQ మరియు Vivid పేర్లతో ఉన్న అల్ట్రాసౌండ్ పరికరాలకు భారతదేశంలో డిమాండ్ పెరుగుతోంది. దీంతో... ఇప్పుడు ఉత్పత్తుల్ని మనం ఇక్కడే తయారు చేసుకుంటున్నాము అని అన్నారు Wipro GE హెల్త్