Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో ద్విచక్రవాహనాలకు సంబంధించి అతిపెద్ద రెంటల్ సంస్థ అయిన వోగో, కొవిడ్ -19 రెండో వేవ్ సందర్భంగా ద్విచక్రవాహనాల రెంటల్స్ డిమాండ్ లో గుర్తించదగిన భేదాలను తెలిపేందుకు యూజర్ ధోరణుల డేటాను వెల్లడించింది. 2021 ఏప్రిల్ లో లాక్ డౌన్ సందర్భంగా ద్విచక్ర వాహనాల రెంటల్స్ కు డిమాండ్ ప్రధానంగా కొవిడ్ వారియర్స్ నుంచి వచ్చినట్లుగా గణాంకాలు వెల్లడి స్తున్నాయి. ఆ సమయంలో యూజర్లలో 54 శాతం మంది కొవిడ్ వారియర్లే. ఫ్రంట్ లైన్ వారియర్లు, డెలి వరీ సిబ్బంది, రోజువారీ కాంట్రాక్టు కార్మికులు, చిన్నస్థాయి వ్యాపారులు (కిరాణా, ఇతర నిత్యావసరాలు) వీరిలో ఉన్నారు. లాక్ డౌన్ ఆంక్షల కారణంగా వ్యక్తిగత వినియోగం బాగా తగ్గిపోయింది. అయితే, ఇప్పు డు ప్రజలు తమ గూళ్లను వదిలి బయటకు వస్తున్నారు. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే స్వల్పకాలిక రెంటల్స్ కు డిమాండ్ బాగా అధికం కావడం. మహ మ్మారి మొదలైన నాటి నుంచి కూడా, స్వల్పకాలిక రెంటల్ ప్యాకేజీలను అందించే వోగో కీప్ 92% విని యోగాన్ని నమోదు చేసింది. ఆసక్తిదాయక అంశం ఏమిటంటే, వినియోగదారులంతా స్కూటర్లను కనీసం 6-7 రోజుల కోసం తీసుకున్నారు. వాహనాన్ని మళ్లీ మళ్లీ వినియోగించాల్సి రావడం లేదా అత్యవసర సందర్భాల కోసమని వాహనాన్ని తమ వద్దనే ఉంచుకోవడం ఇందుకు కారణం. ఈ సందర్భంగా వోగో వ్యవస్థాపకులు, సీఈఓ ఆనంద్ అయ్యదురై మాట్లాడుతూ, ‘‘ప్రతికూల పరిస్థితుల్లో నూ పని చేయడాన్ని, ప్రజలకు సేవలను అందించడాన్ని కొనసాగించడం ద్వారా కొవిడ్ వారియర్లు అద్భు త పునరుజ్జీవనాన్ని ప్రదర్శించారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడంపై భయం వ్యక్తం చేసినట్లుగా ఉంది. అందుకే దానికి బదులుగా షేరింగ్ ఉండని చౌక మార్గాల వైపు దృష్టి సారించారు. వారికి సేవలు అందించడాన్ని మాకు గర్వకారణంగా భావిస్తున్నాం’’ అని అన్నారు. ‘‘తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వినియోగంలో, సంఖ్యలో మార్పులు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత వినియోగానికి డిమాండ్ క్రమంగా అధికమవుతోంది. ప్రజలు టీకాలు వేయించుకోవడం, కార్యాల యాలు తిరిగి పని చేయడం వంటి వాటితో రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరుగుతుందని మేం భావి స్తున్నాం’’ అని ఆనంద్ అన్నారు.