Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ, సాంకేతిక శాఖ డైరెక్టర్ కారంపూరి సుజాయి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తెలంగాణ త్వరలోనే నెంబర్‌వన్ స్థానానికి ఎదుగుతుందని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్లు, సాంకేతిక శాఖ డైరెక్టర్ కారంపూరి సుజాయి ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యుత్, రవాణాతోపాటు పెట్టుబడులకు సంబంధించిన వివిధ అంశాల్లో సబ్సిడీలను ఇవ్వటం ద్వారా ఆయా వాహనాల తయారీ కంపెనీలను ఆకర్షించనున్నామని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పాలసీపై శుక్రవారం హైదరాబాద్‌లో వెబినార్‌ను నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అజరు మిశ్రా కీలకోపన్యాసం చేశారు. టీఎస్ రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్య ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజయి మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ద్వారా కాలుష్య రహిత ప్రయాణానికి దోహదపడొచ్చని తెలిపారు. ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా ప్రయాణించటంతోపాటు వీటి తయారీ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధిని కల్పించొచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం... రంగారెడ్డి జిల్లాలో చందన్‌వల్లి, సీతారాంపూర్తోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లిలో రెండు క్లస్టర్లను ఏర్పాటు చేయనుందని వివరించారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు కె.భాస్కరరెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు అనిల్ అగర్వాల్, మీలా జయదేవ్, సీఈవో ఖ్యాతి నరవేనె, డిప్యూటీ సీఈవో టి.సుజాత తదితరులు పాల్గొన్నారు.