Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు కొనుగోళ్ల మద్దతుతో శుక్రవారం ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 593 పాయింట్లు పెరిగి 55,437కు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 165 పాయింట్లు రాణించి 16,529కు చేరాయి. జూన్‌లో 6.29 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ జులైలో 5.59 శాతానికి తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. బీఎస్ఈ ర్యాలీతో ఒక్క పూటలోనే మదుపర్ల సంపద రూ.1.37 లక్షల కోట్లు పెరిగింది. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షూచీ 0.06 శాతం, 0.01 శాతం చొప్పున తగ్గాయి.సెన్సెక్స్-30లో టీసీఎస్, ఎల్అండ్డీ, భారతీ ఎయిర్టెల్, హెచ్ సీఎల్ టెక్, టాటా స్టీల్, బజాజ్ ఆటో సూచీలు అత్యధికంగా 3.22 శాతం మేర పెరిగి మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి.