Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : వైద్య పరీక్షల్లో అత్యంత కీలకమైన వెర్సన అల్ట్రాసౌండ్ ఉత్పత్తులను సొంతగా తయారు చేసినట్టు విప్రో జీఈ వెల్లడించింది. వీటిని బెంగళూరులోని తమ కడుగొడి ఉత్పత్తి కేంద్రంలో తయారు చేసినట్టు తెలిపింది. స్థానికంగా తాము తయారు చేయబోతున్న ఈ ఉత్పత్తుల ద్వారా వెర్సన దిగుమతులు సగానికి సగం తగ్గిపోతాయని విప్రో జీఈ హెల్త్ కేర్ సౌత్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రవణ్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ధర కూడా తగ్గి, ఆ ప్రయోజనం వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందన్నారు. 2021 చివరి నాటికి ఓబీ, జీవైఎన్, రేడియాలజీ, కార్డియాలజీ, అనస్థీషియా, అత్యవసర, క్లిష్టమైన సంరక్షణ విభాగాలకు కావాల్సిన ఏడు అల్ట్రాసౌండ్ ఉత్పత్తులను స్థానికంగా తయారు చేసుకోవాలన్నదే తమ ధ్యేయమన్నారు.