Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరీ సీడ్స్ 2021 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో రూ.204.73 కోట్ల లాభాలు ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలోని రూ.296.41 కోట్ల లాభాలతో పోల్చితే 30.93 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. క్రితం క్యూ1లో కంపెనీ నికర అమ్మకాలు 12.47 శాతం తగ్గి రూ.629.77 కోట్లుగా నమోదయ్యాయి. తీవ్ర సవాళ్ల సమయంలోనూ మెరుగైన ఫలితాలను సాధించామని కావేరీ సీడ్స్ ఛైర్మన్ అండ్ ఎండి జివి భాస్కర రావు తెలిపారు.