Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారత్ పెట్రో లియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్ ్) ఇంటి వద్దకు హైస్సీడ్ డీజిల్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. పెరుగు తున్న డిమాండ్‌ను చేరడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా తూర్పు ప్రాంతలో 15 మొబైల్ వాహనాలతో డెలివరీని ప్రారంభించినట్లు పేర్కొంది. సులభ వ్యాపారంలో భాగంగా నిర్ణీత సమయంలో నాణ్యమైన, కచ్చిత పరిమాణం, భద్రత మధ్య వినియోగదారులకు డీజిల్‌ను అందిస్తున్నట్లు బిపిసిఎల్ రిటైల్ ఇంచార్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎస్ రవి తెలిపారు.