Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారత బ్యాంక్‌లకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజరు మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ హౌస్‌ను హైదరాబాద్‌కు చెందిన ఒక సంస్థ కొనుగోలు చేసింది. ముంబయిలోని మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రధాన కార్యాలయమైన విలే పార్లేలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను రుణ రికవరీ ట్రిబ్యునల్ వేలం వేయగా హైదరాబాద్‌కు చెందిన శాటర్న్ రియల్టర్స్ రూ.52.25 కోట్లకు దీనిని కొనుగోలు చేసింది. ముంబై విమానాశ్రయం వెలుపల ఉన్న 2401.70 చదరపు మీటర్ల కింగ్‌ఫిషర్ హౌస్ ఆస్తి, 2016 నుంచి జప్తులో ఉన్నది. బెంగళూరుకు చెందిన డెట్ రికవరీ ట్రిబ్యునల్ దీనిని తొలుత రూ.135 కోట్ల ప్రారంభ రిజర్వ ధర కింద విక్రయించడానికి చేసిన ఎనిమిది ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరకు 9వ సారి వేలంపాటలో శాటర్న్ రియల్టర్స్ దీన్ని దక్కించుకుంది.