Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగూరు: మణిపాల్ హాస్పిటల్స్ ఈ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను, బెంగళూరులో ఎల్జీబీటీక్యు సమాజానికి చెందిన సుప్రసిద్ధ వ్యక్తి ఆడమ్ పాషా తో కలిసి నిర్వహించింది. డ్రాగ్ సంస్కృతి ద్వారా వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం పోరాడిన వ్యక్తి ఆడమ్ పాషా. నేడు జాతీయ జెండాను ఎగురవేసిన మొట్టమొదటి ఎల్జీబీటీక్యు సభ్యునిగా గౌరవాన్ని అందుకున్నారాయన. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని స్వేచ్ఛ మరియు సమానత్వపు ప్రతీకగా, మూసపద్ధతులను బద్దలు కొడుతూనే సమ్మిళిత సందేశాన్ని వ్యాప్తి చేస్తూ నిర్వహించింది మణిపాల్ హాస్పిటల్స్. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీలకు స్ఫూర్తినొందించిన వ్యక్తి ఆడమ్ పాషా. ఎల్జీబీటీక్యు కమ్యూనిటీ యొక్క సామాజిక హక్కులు, సమానత్వం కోసం ఆయన ఎంతగానో తోడ్పాటునందించారు.
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వద్ద నున్న మణిపాల్ హాస్పిటల్స్ , హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ మనీష్ రాయ్ మాట్లాడుతూ ‘‘మన అత్యంత విలువైన ఆస్తి మన ప్రజలు. వైవిధ్యత మరియు సమ్మిళిత సంస్కృతిని మేము సృష్టించాము. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేళ, ఆరోగ్య సంరక్షణలో ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లిపోవాలనే నిర్ణయం తీసుకున్నాము. మన జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమంలో ఆడమ్ పాషా పాల్గొనడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఆరోగ్య సంరక్షణలో సమానత్వం తీసుకురావడంలో విజయానికి ప్రతీకగా నిలుస్తుంది’’ అని అన్నారు.
ఆడమ్ పాషా మాట్లాడుతూ ‘‘ మణిపాల్ హాస్పిటల్స్ వద్ద, ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేళ జెండాను ఎగురవేసే గౌరవాన్ని పొందడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎల్జీబీటీక్యు కమ్యూనిటీ యొక్క స్వేచ్ఛ, సమానత్వంకు మరియు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో సమ్మిళితకు అసలైన ప్రతీకగా ఇది నిలుస్తుంది. ఈ సంవత్సరపు ప్రైడ్ మంత్ను సైతం మణిపాల్ హాస్పిటల్స్ వేడుక చేస్తూ ఎల్జీబీటీక్యు కమ్యూనిటీకి టీకాలను అందించింది. ఇది ఖచ్చితంగా మా కమ్యూనిటీని ఆరోగ్యంగా, సురక్షితంగా మలవడంలో సహాయపడింది. ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు, ప్రతి ఒక్కరూ తమపై తమకున్న సందేహాలను పటాపంచలు చేసుకుంటూనే తమను తాము వ్యక్తీకరించుకోవడానికి కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను’’ అని అన్నారు.