Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహజసిద్ధమైన, కల్తీలేని పాలు, పన్నీర్, పెరుగు, మజ్జిగ, నెయ్యి ఆన్లైన్లో డెలివరీ
హైదరాబాద్: తెలంగాణా కేంద్రంగా కలిగిన ప్రీమియం పాలు, పాల ఉత్పత్తుల బ్రాండ్ సిద్స్ ఫార్మ్, తెలంగాణా వాసుల కోసం ప్రత్యేకంగా యాప్‌ను విడుదల చేసింది. తొలుత హైదరాబాద్ వాసులకు ఈ సేవలను అందించనున్నారు. సిద్స్ ఫార్మ్ ఫౌండర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ 'వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా ఆవు పాలు, గేదె పాలు, నెయ్యి, వెన్న,పన్నీర్, ఆవు పెరుగు, గేదె పెరుగు ఆన్లైన్లో డెలివరీ పొందవచ్చు. ప్రతి రోజూ రాత్రి 10 గంటల లోపు ఆర్డర్ చేస్తే ఉదయం 7 గంటలకు తమ ఇంటి ముంగిట వాటిని అందుకోవచ్చు. వినియోగదారులు ఈ యాప్‌ను ప్లేస్టోర్, ఐఓఎస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ బ్రాండ్‌కు ఈ ప్రాంతంలో 100కు పైగా స్టోర్లు ఉన్నాయి. బిగ్‌బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వేదికల ద్వారా కూడా లభ్యమవుతుంది.