Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారీ పెట్టుబడులు, పరిశ్రమలకు హాట్‌స్పాట్‌గా మారిన హైదరాబాద్ నగరంలో మరో ప్రముఖ బ్రాండ్ కొలువుతీరింది. హైదరాబాద్‌లో కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్, ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో సోమవారం ప్రకటించింది. ఏఐని వాడుతూ కెమెరా సొల్యూషన్స్ అందించేందుకు, మెరుగైన యూజర్ అనుభూతి కోసం ఇమేజింగ సాఫ్ట్‌వేర్‌పై దృష్టిసారించేలా ల్యాబ్‌ను డిజైన్ చేస్తామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
నైట్ వీడియోగ్రఫీ, లైట్ టెంపరేచర్స్ వంటి అంశాలకు నూతన సొల్యూషన్లపై కెమెరా ల్యాబ్ పనిచేస్తుందని వెల్లడించింది. గ్లోబల్ సొల్యూషన్లను స్ధానికంగా అందించడం, నూతన సొల్యూషన్స్‌ను చేపట్టడంపై దృష్టిసారిస్తామని, ల్యాబ్ సెటప్ ద్వారా యూజర్లకు మెరుగైన కెమెరా అనుభూతి కలిగించేలా కృషి చేస్తామని ఒప్పో ఇండియా ఆర్అండ్డీ హెడ్, వైస్ ప్రెసిడెంట్ తస్లీం ఆరిఫ్ తెలిపారు. అత్యాధునిక పరికరాలతో అడ్వాన్స్ క్వాలిటీ ఇమేజింగ్, వీడియో షూటింగ్ అనుభూతిని అందిస్తామని ఒప్పో ఇండియా ఆర్అండ్డీ కెమెరా డివిజన్ హెడ్ కౌషల్ ప్రకాష్ శర్మ పేర్కొన్నారు.