Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారతదేశంలోని గ్రాడ్యుయేట్లతో పాటుగా యువ ప్రొఫెషనల్స్‌కు సహాయపడేందుకు
ఒడిన్స్కూల్ను ప్రారంభిస్తున్నట్లు గ్రే క్యాపస్ ప్రకటించింది. ఎలాంటి ముందస్తు పెట్టుబడి అవసరం లేకుండా పరిశ్రమ సంబంధిత కార్యక్రమాలతో తమంతట తాము నైపుణ్యాభివృద్ధి చేసుకోవడంలో ఇది సహాయపడనుంది. ఈ నూతన అప్‌స్కిల్లింగ్ వేదిక, వారి కెరీర్లను ఆరు నెలల్లో ఎలాంటి ఆర్థిక భారమునకూ లోను కాకుండా ప్రారంభించుకోవడం, సమూలంగా మార్చుకోవడం, తమ కెరీర్లను వృద్ధి చేసుకోవడంలో సహాయపడుతుంది. దీని యొక్క ఆదాయ పంపిణీ ఒప్పంద (ఐఎస్ఏ) నమూనాతో అభ్యాసకులు తమ ట్యూషన్ ఫీజులను వాయిదా వేయడానికి మరియు ఉపాధి అవకాశాలను పొందిన తరువాత తమ సీటీసీలో 10% చెల్లించడానికి అనుమతిస్తుంది.
ఒడిన్స్కూల్ ఇప్పుడు ఆరు నెలల కాలానికి బూట్ క్యాంప్‌లను డాటా సైన్స్ మరియు ఫుల్‌స్టాక్
డెవలప్మెంట్లో అందిస్తుంది. ఇది యువ ప్రొఫెషనల్స్ మరియు గ్రాడ్యుయేట్లు తమ కెరీర్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి డిమాండ్‌లో ఉన్న నైపుణ్యాలను పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లకు పరిశ్రమ వెటరన్స్ నేతృత్వం వహిస్తుండటంతో పాటుగా అభ్యర్థులకు ముఖాముఖి మెంటార్షిప్ సదస్సులను సైతం నిర్వహించనున్నారు. ‘‘ఒడిన్ స్కూల్ వద్ద, మేము ఉద్యోగ సంబంధిత అభ్యాస అనుభవాలను అందిస్తుంటాం. ఈ ప్రోగ్రామ్‌లను మా అభ్యాసకులు తమ నైపుణ్యాలను డాటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ద్వారా మెరుగుపరుచుకునే అవకాశం అందించింది. కెరీర్ శిక్షణా కార్యక్రమాల ప్రీమియం ప్రదాతగా, అన్ని సామాజిక–ఆర్ధిక పూర్వాపరాలు కలిగిన ప్రజలకు మా కోర్సులను అందుబాటులో ఉంచడానికి కట్టుబడి ఉన్నాం. ఐఎస్ఏ మోడల్, విద్యార్థులకు అనుకూలమైన కార్యక్రమం. వారికి ఉద్యోగాలు వచ్చిన తరువాత ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చు. తమ కెరీర్లను మరింతగా వృద్ధి
చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది’’ అని విజయ్ పసుపులేటి, సీఈఓ అండ్ కో–ఫౌండర్, గ్రే క్యాంపస్ అన్నారు.