Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్‌లైన్స్ ఫెడరేషన్ ఆందోళన
హైదరాబాద్ : వినియోగ అభివృద్థి రుసం (యుడిఎఫ్) ఛార్జీలను పెంచుకోవడానికి అనుమతివ్వాలని ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యూలేటరీ అథారిటీకి జిఎంఆర్ గ్రూపు ప్రతిపాధించడాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ వ్యతిరేకించింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో యుడిసి టారీఫ్‌లను సవరించాలని జిఎంఆర్ గత నెలలో ఎఇఆర్ఎను కోరింది. వచ్చే అక్టోబర్ నుంచి ప్రస్తుతం యుడిఎఫ్ ఛార్జీలను రూ.281 నుంచి రూ.608కు చేర్చాలని ప్రతిపాదించింది. దీన్ని అమలు చేయకుండా ఎఇఆర్ఎను ఎఫ్ఐఎ అభ్యర్తించింది. ఎఫ్ఐఎలో ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇప్పటికే కరోనా దెబ్బతో పరిశ్రమ తీవ్ర నష్టాల్లో ఉందని.. యుడిఎఫ్ ఛార్జీలు పెంచితే ప్రయాణికులపై భారం పడుతుందని, దీంతో డిమాండ్ తగ్గుతుందని ఎఫ్ఐఎ ఆందోళన వ్యక్తం చేసింది.