Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు ఇ-కామర్స్ రంగంలోకి ప్రవేశించనుంది. ఇందుకోసం సూపర్ యాప్ ఆవిష్కరించనున్నట్లు ఆదానీ డిజిటల్ ల్యాబ్స్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో గౌతం ఆదానీ వెల్లడించారు. ఇ-కామర్స్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్, రీ చార్జింగ్ సర్వీస్ తదితర సేవలను తన ఖాతాదారులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. వంట నూనెలు, గ్యాస్, విమానాశ్రయాలు, రియాల్టీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, విద్యుత్ తదితర రంగాల్లో ఆదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.