Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకమైన, యుఎస్ఏలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) యొక్క పలు ప్రోగ్రామ్‌లు, ఇతర కార్యక్రమాలతో తాము భాగస్వామ్యం చేసుకున్నామని హీరో విర్డ్ ప్రకటించింది. ఈ బహు ముఖ బంధంను అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ జాబితాకు సంబంధించిన పరిశ్రమకు అధికంగా కావాల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడానికి రూపొందించడం జరిగింది. దశాబ్దాల తరబడి హీరో యొక్క పరిశోధన మరియు భారతీయ విద్యావిధానం, ఉద్యోగ వాతావరణం అర్ధం చేసుకున్న తీరుతో, శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంఐటీ యొక్క అత్యాధునిక నైపుణ్యం మిళితం చేసి భారతీయ ఉద్యోగార్థులకు మహోన్నతమైన, ప్రత్యేక కార్యక్రమాలను తీసుకురావడానికి సమాయత్తమైంది.
ఈ భాగస్వామ్యం గురించి హీరో విర్డ్ ఫౌండర్, సీఈవో అక్షయ్ ముంజాల్ మాట్లాడుతూ ‘‘ హీరో విర్డ్ వద్ద మేము విద్యను పునరావిష్కరిస్తున్నాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కలిసి పనిచేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న, భావి సాంకేతికతలలో బహుళ కార్యక్రమాలను అందించనుండటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మరీ ముఖ్యంగా ఎంఐటీ ఎక్స్ మైక్రో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను మా పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లతో మిళితం చేయడం పట్ల అమితాసక్తితో ఉన్నాం. ఎంఐటీఎక్స్ మైక్రో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన హీరో విర్డ్ విద్యార్థులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్శిటీలలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుంది. తద్వారా వేగవంతంగా వారు మైక్రోమాస్టర్స్ క్రెడెన్షియల్ హోల్డర్లుగా మారేందుకు వేగవంతంగా డిగ్రీ పూర్తి చేసేందుకు మార్గమూ ఏర్పడుతుంది. హీరోవిర్డ్ యొక్క వినూత్నమైన ఆఫరింగ్స్, పరిశ్రమ అవగాహన వంటివి భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నియామక నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను తీర్చిదిద్దగలదనే నమ్మకం ఉంది’’ అని అన్నారు.
భారతదేశపు మొట్టమొదటి, పరిశ్రమ లక్ష్యిత పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను పరిశ్రమ యొక్క నిర్ధిష్టమైన అవసరాలను అందుకునే రీతిలో డాటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, ఏఐ లలో అందించడంతో పాటుగా మరో దానిని ఆర్ధిక మరియు ఆర్థిక సాంకేతికతలలో అందించేందుకు దృష్టి సారించింది. ఈ రెండు పీజీ ప్రోగ్రామ్‌లూ 11 నెల కాల వ్యవధి కలిగి ఉంటాయి. ఆర్థిక లేదా డాటా సైన్స్‌లో తమ కెరీర్లను రూపొందించుకోవాలనుకునే విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు. మూడవ ప్రోగ్రామ్, ఆరు నెలల స్వల్పకాలిక సర్టిఫికెట్ ప్రోగ్రామ్. దీనిని గేమ్ డిజైనింగ్‌లో అందించనున్నారు. గేమింగ్ ప్రియులతో పాటుగా ఈ రంగంలో ఎవరైతే తమ కెరీర్లను తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారో వారి కోసం దీనిని తీర్చిదిద్దడం జరిగింది.
ఎంఐటీఎక్స్ డైరెక్టర్ డానా డోయల్ మాట్లాడుతూ ‘‘ విద్య, పరిశోధన, ఆవిష్కరణ ద్వారా అత్యుత్తమ ప్రపంచాన్ని తీర్చిదిద్దాలనే భాగస్వామ్య కారణం చేత ఎంఐటీ వద్ద మేము ముందుకు నడుపబడుతున్నాం. ఎంఐటీ ఎక్స్ కోర్సులతో పాటుగా ఎంఐటీఎక్స్ మైక్రో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను భారతదేశంలో ప్రొఫెషనల్స్ కోసం హీరో విర్డ్ ఆవిష్కరించిన భారీ, ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లు అయినటువంటి ఈ పీజీ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లలో మిళితం చేయడం పట్ల సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, హీరో విర్డ్ యొక్క కార్యక్రమాలు, ఎంఐటీ ఎక్స్ మైక్రో మాస్టర్స్ ప్రోగ్రామ్‌లలో మిళితం కావడంతో పాటుగా భారతీయ ఉద్యోగ మార్కెట్ కోసం అత్యంత లాభదాయకమైన నైపుణ్యాలు, పరిజ్ఞానాన్ని అందిస్తాయి. అదే సమయంలో, ప్రపంచవ్యాప్తంగా మాస్టర్స్ ప్రోగ్రామ్‌లకూ మార్గాన్ని అందిస్తాయి.
2017లో ఎంఐటీ ప్రారంభించిన అబ్దుల్ లతీఫ్ జమీల్ వరల్డ్ ఎడ్యుకేషన్ ల్యాబ్ (జె–డబ్ల్యుఈఎల్)లో నూతన సభ్యునిగా హీరో విర్డ్ నిలువడంతో పాటుగా కమ్యూనిటీ జమీల్లో కూడా భాగమైంది. విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, విధాన నిర్ణేతలు, సామాజిక నాయకులు, ఉద్యోగులు, యజమానులను నిమగ్నం చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విద్యలో శ్రేష్టత మరియు మార్పును జె–డబ్ల్యుఈఎల్ ప్రోత్సహిస్తున్నది. జె–డబ్ల్యుఈఎల్లో సభ్యునిగా, హీరో విర్డ్ ఇప్పుడు 25 ఇతర యూనివర్శిటీలు, లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, ప్రపంచంలో అత్యంత సమస్యాత్మకంగా నిలిచిన విద్యా సవాళ్లను నిర్వహించేటటువంటి కంపెనీలు, నూతన విద్యా సాంకేతికతలు అందించే అవకాశాలను అన్వేషించే సంస్థలతో జత కలిసింది. జె–డబ్ల్యుఈఎల్ ద్వారా, హీరో విర్డ్కు ఇన్స్ట్రక్టర్లను, ఫ్యాకల్టీని బోధనకు సంబంధించి తాజా పరిశోధనాధారిత విధానంతో ఎంఐటీ అందిస్తుంది. తమ భాగస్వామ్యంతో ఎంఐటీ యొక్క ఫ్యాకల్టీని గెస్ట్ లెక్చర్స్ కోసం వినియోగించుకునే అవకాశం కూడా హీరో విర్డ్ కు కలుగుతుంది.