Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత్ మార్కెట్లో మొటొరొలా ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 ఫ్యూజన్‌లను లెనోవాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మొటొరొలా మంగళవారం విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. మొటొరొలా ఎడ్జ్ 20 ఆగస్ట్ 24 నుంచి సేల్కు రానుండగా, ఎడ్జ్ ఫ్యూజన్ సేల్ 27 నుంచి ప్రారంభం కానుంది. మొటొరొలా ఎడ్జ్ ప్యూజన్ 20 108 ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్‌తో క్వాడ్ ఫంక్షన్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రానుంది. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆకట్టుకోనుంది. 128 జీబీ బిల్టిన్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పదినిమిషాల చార్జింగ్‌తో మొబైల్ ఫోన్ 12 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. మొటొరొలో ఎడ్జ్ 20 స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ 11తో అందుబాటులో ఉంది. 108 ఎంపీ ప్లస్ 8ఎంపీ ప్లస్ 16 ఎంపీ రియర్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఎడ్జ్ 20 మ్యాక్స్ విజన్ హెచ్డీఆర్ 10ప్లస్ అమోల్డ్ స్క్రీన్‌తో కూడిన డిస్ప్లేతో ఆకట్టుకుంటోంది.