Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాబోయే కొద్ది సంవత్సరాలలో ఎలక్ట్రానిక్స్ రీటైల్ రంగం కోసం 50,000 మంది యువతని ఉద్యోగానికి సిద్ధం చేసే సీఎస్ఆర్ లక్ష్యం, ‘శామ్ సంగ్ దోస్త్’ (డిజిటల్ & ఆఫ్ లైన్ నైపుణ్యాల శిక్షణ) యొక్క ఆరంభాన్ని శామ్ సంగ్ ఇండియా నేడు ప్రకటించింది. తమ దేశవ్యాప్తంగా ఉన్న నైపుణ్యాలకు శిక్షణనిచ్చే కేంద్రాలు ద్వారా కార్యక్రమాన్ని అమలు చేయడానికి భారతదేశపు అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్ సంగ్, భారతదేశపు ప్రీమియర్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్ డీసీ) తో భాగస్వామం చెందింది.
శామ్ సంగ్ దోస్త్ ఎలక్ట్రానిక్స్ రంగంలో అతి పెద్ద నైపుణ్యాల శిక్షణా కార్యక్రమం కానుంది.
గత 25 సంవత్సరాలుగా శామ్ సంగ్ భారతదేశంలో నిబద్ధత కలిగిన అతి పెద్ద భాగస్వామిగా వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ రంగంలో తయారీ ఆర్ & డీ, రీటైల్ మరియు కమ్యూనిటీ అభివృద్ధిలో కీలకమైన పెట్టుబడులతో నాయకునిగా కొనసాగుతోంది. శామ్ సంగ్ భారతదేశంలో నోయిడాలో ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది మరియు ప్రభుత్వానికి చెందిన అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీలో కీలకమైన భాగస్వామిగా పని చేస్తూ తయారీ మరియు రీటైల్ రంగంలో యువత కోసం గణనీయమైన ఉపాధి అవకాశాల సంఖ్యని సృష్టించనుంది.
నైపుణ్యాలలో శిక్షణ తీసుకున్న తరువాత, ఉపాధి కల్పన సంభావ్యతని పరిగణించి, ‘శామ్ సంగ్ దోస్త్’ కార్యక్రమం కోసం ఎన్ఎస్ డీసీతో ఒక అంగీకార వినతి పత్రం పై శామ్ సంగ్ సంతకం చేసింది. దీని ద్వారా యువత 200 గంటలు ఆన్ లైన్ మరియు తరగతి గది యొక్క మిశ్రమ శిక్షణని అందుకుంటుంది, తదుపరి శామ్ సంగ్ రీటైల్ స్టోర్స్ లో (ఓజేటీ) అయిదు నెలలు ఆన్-ది-జాబ్ శిక్షణతో పాటు పరిశ్రమలో ఉన్న ప్రామాణాలు ప్రకారం నెలవారీ స్టైపెండ్ కూడా అందచేస్తుంది. ఇది భారతదేశంలో అతి వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ రీటైల్ వాతావరణంలో అవసరమైన కొత్త సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు యువత సంపాదించడంలో సహాయపడుతుంది.
శ్రీ కెన్ కాంగ్, ప్రెసిడెంట్ & సీఈఓ, శామ్ సంగ్ నైరుతి ఆసియా ఇలా అన్నారు: “శామ్ సంగ్ భారతదేశంలో నిబద్ధత కలిగిన భాగస్వామిగా గత 25 సంవత్సరాలుగా కొనసాగుతోంది మరియు తమ పౌరసత్వం కార్యక్రమాలు ద్వారా భారతదేశం వ్యాప్తంగా ప్రజలు మరియు సమాజాలకు తోడ్పడింది. ద శామ్ సంగ్ దోస్త్ కార్యక్రమం భారత ప్రభుత్వం యొక్క స్కిల్ ఇండియా చొరవకి మద్దతు ఇస్తోంది మరియు ఆధునిక భారతదేశపు యువతకి సాధికారతని కోరుకునే #PoweringDigitalIndia యొక్క మా కలకి రూపంగా నిలిచింది. ఈ కొత్త కార్యక్రమంతో, దేశంలో యువతలో నైపుణ్యాలు మరియు ఉపాధి సామర్థ్యంలో అంతరాల్ని అందం చేసి మరియు అతి వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ రీటైల్ రంగంలో ఉద్యోగాల్ని గుర్తించడంలో వారికి సహాయం చేసే లక్ష్యాన్ని మేము కలిగి ఉన్నాము.”
పాల్గొనే వారికి ఎన్ ఎస్ డీసీ గుర్తించి మరియు ఆమోదించిన వివిధ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ కి అనుగుణంగా శిక్షణ ఇవ్వబడుతుంది, ఇది పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంది మరియు కస్టమర్ ప్రమేయం, సేల్స్ కౌండర్ నిర్వహణ, కస్టమర్ సందేహాల్ని నిర్వహించడం, ఉత్పత్తి ప్రదర్శన మరియు పోస్ట్-కోవిడ్ మర్యాదలు సహా నైపుణ్యాలు మరియు పలు ఇతర సాఫ్ట్ నైపుణ్యాల్ని విక్రయించడం , ఎలక్ట్రానిక్స్ రీటైల్ లో కెరీర్ కోసం వారిని తయారు చేయడం వంటి నైపుణ్యాలు దీనిలో భాగంగా ఉంటాయి. ఓజేటీ సమయంలో, లైవ్ ప్రదర్శనలు, బాధ్యతల నిర్వహణా మెళుకువలు మరియు అభ్యాసన ద్వారా నేర్చుకోవడం వంటి వాటి ద్వారా ఎలక్ట్రానిక్స్ రీటైల్ స్టోర్స్ పనితీరు పాల్గొంటున్న వారికి పరిచయమవుతుంది.
కార్యక్రమంలో పాల్గొనే యువత పాఠశాల చదువుని పూర్తి చేసి ఉండాలి మరియు దేశవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఎన్ఎస్ డీసీ ఆమోదించిన శిక్షణా భాగస్వామాలు ద్వారా సమీకరించబడతారు. పాల్గొంటున్న వారు తమ ఓజేటీని పూర్తి చేసిన తరువాత పాల్గొనేవారి యొక్క అంచనాలు మరియు ధృవీకరణల్ని టెలీకామ్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (టీఎస్ఎస్ సీ) పూర్తి చేస్తుంది.
‘శామ్ సంగ్ దోస్త్’ తో, శామ్ సంగ్ తమ సీఎస్ఆర్ చొరవల్లో భాగంగా భారతదేశంలో తమ నైపుణ్య కార్యక్రమాల్ని విస్తరిస్తోంది. శామ్ సంగ్ , వివిధ రాష్ట్రాలలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం భాగస్వామంతో 2013 నుండి శామ్ సంగ్ టెక్నికల్ స్కూల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం క్రింద, యువతకు కొత్త స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషీన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ మరమ్మతు చేయడానికి వృత్తిపరమైన నైపుణ్యాలు కేటాయించబడతాయి.