Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా (విఐ) దివాలా అంచున కొట్టుమిట్టాడుతోంది. 2021 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)ఆర్థిక ఫలితాలు అత్యంత స్తబ్దుగా ఉండటంతో విఐ ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు గురైతున్నారు. గడిచిన క్యూ1లో కంపెనీ 1.2 కోట్ల మందిని ఖాతాదారులను కోల్పోయింది. సంస్థ రెవెన్యూ 4.7 శాతం తగ్గి రూ.9,200 కోట్లకు పడిపోయింది. రూ.7300 కోట్ల నష్టాలు చవి చూసింది. సంస్థ నష్టాలు పెరగడం, రుణ, వడ్డీ చెల్లింపులు నిలిచిపోవడంతో ఈ సంస్థ కార్యకలాపాలపై నీలినీడలు కమ్ముకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా తీవ్ర రిస్కులో ఉందని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అనలిస్టు ఒక్కరు పేర్కొన్నారు. గడిచిన నెల రోజుల్లో ఈ కంపెనీ షేర్ 38.25 శాతం క్షీణించి మంగళవారం రూ.5.65 వద్ద ముగిసింది.