Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైజాగ్ స్టీల్ కొనుగోలుకు ఆసక్తి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని వైజాగ్ స్టీల్‌పై టాటా గ్రూపు కన్నేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రీయా ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నామని టాటా స్టీల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ టివి నరేంద్రన్ తెలిపారు. వైజాగ్ స్టీల్‌లోని 100 శాతం వాటాలను కార్పొరేట్లకు విక్రయించడానికి ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సంస్థ కొనుగోలు అంశంపై నరేంద్రన్ను ఓ న్యూస్ ఎజెన్సీ ప్రశ్నించగా.. తాము దీర్ఘకాల అవకాశాలపై దృష్టి పెడుతున్నామని.. వైజాగ్ స్టీల్‌ను కొనుగోలు చేసే యోచనలో ఉన్నామన్నారు. దక్షిణాది.. అందులోనూ తూర్పు ప్రాంతంలోని ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా విస్తృతావకాశాలు ఉన్నాయన్నారు. ఆర్ఐఎన్ఎల్కు 22వేల ఎకరాల స్థలం, గంగవరం పోర్టు, ముడి సరుకు తదితర అనేక సదుపాయాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏడాదికి 7.3 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. నీల్చల్ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, ఎంఎంటీసీ, ఎన్ఎండీసీ, భెల్, మెకోన్, రెండు ఒడిశా ప్రభుత్వ సంస్థలు ఐపీఐసీఓఎల్, ఎఎంసీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చుతున్నామని నరేంద్రన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రయివేటీకరణ వాటాల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల నిధులు సమకూర్చుకోవాలని మోడీ ప్రభుత్వం బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఈ సంస్థ ప్రయివేటీకరణను నిలిపివేయాలని గత కొన్ని నెలలుగా ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ప్రజలు తీవ్ర ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే