Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హోండా కార్స్ ఇండియా లి. (HCIL), భారతదేశంలో ప్రీమియం కార్ల తయారీలో అగ్రగామి, ఈ రోజు విడుదల చేసింది, మరింత మెరుగైన లుక్స్, ప్రీమియం ఎక్స్టీరియర్స్ స్టైలింగ్ మరియు విలాసవంతమైన ఇంటీరియర్లు కలిగిన న్యూ అమేజ్.ఈ ‘ఠీవైన’ న్యూ అమేజ్, సగర్వమైన జీవితాన్ని జీవించే స్ఫూర్తికి నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తుంది, తన సరికొత్త రూపంలో ఒక పూర్తి సరికొత్త వైఖరిని, తాజా భరోసాని ప్రతిబింబిస్తుంది.ఈ ప్రీమియం ఫ్యామిలీ సెడాన్, మాన్యువల్ మాత్రమే కాక CVT ట్రాన్స్మిషన్లలో, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో లభిస్తుంది.ఒక సరికొత్త రంగు మెటియొరాయిడ్ గ్రే మెటాలిక్ రంగును శ్రేణిలో చేర్చటం జరిగింది. ఇది సమకాలీన మరియు ప్రీమియం లుక్స్‌ను పెంపొందిస్తుంది.
కొత్త అమేజ్ విడుదల సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ గాకు నకనిషి, ప్రెసిడెంట్, సిఇఒ, హోండా కార్స్ ఇండియా లి మాట్లాడుతూ, “భారతదేశంలో 4.5 లక్షల మందికి పైగా కస్టమర్ల ఆమోదాన్ని పొందిన మా అత్యంత విజయవంతమైన మోడల్యొక్క న్యూ అమేజ్‌ను విడుదల చేయటం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రత్యేకించి భారతీయ వినియోగదారుల కోసం అభివృద్ధిపరిచిన, కేవలం భారతదేశంలో మాత్రమే తయారైన ఈ అమేజ్, మా బిజినెస్‌కు ఒక వ్యూహాత్మకమైన మోడల్. భారతదేశంలో ప్రస్తుతం హోండాకు ఇది అత్యధిక సంఖ్యకు, దేశంలో అత్యుత్తమంగా అమ్ముడవుతున్న సెడాన్లలో ఒకటిగా కొనసాగేందుకు దోహదం చేస్తోంది. మెరుగైన లుక్స్ మరియు స్టైలింగ్ కలిగిన న్యూ అమేజ్, మా కస్టమర్లకు సెడాన్ అనుభవానికి ఒక క్లాస్ ఎక్కువ అనుభవాన్ని అందించటం ద్వారా ఆహ్లాదాన్ని కలిగించే సంకల్పంతో రూపొందించబడింది” “పండుగ కాలం ప్రారంభం కాబోతున్న తరుణంలో మేము ఈ న్యూ అమేజ్‌ను విడుదల చేస్తున్నాము. మా కస్టమర్లు ఉత్సాహంగా ఈ కారును ఆహ్వానించి ఆదరిస్తారని మేము నమ్మకం కలిగి ఉన్నాము” అని కూడా ఆయన అన్నారు.
కొత్త అమేజ్ వెలుపలి వైపు చేసిన మార్పుల్లో, బలమైన మరియు నాజూకైన భావనను కలిగించే ఫైన్ క్రోమ్ మోల్డింగ్ లైన్లతో కూడిన స్లీక్ సాలిడ్ వింగ్ ఫేస్ ఫ్రంట్ గ్రిల్, ఆధునికమైన మరియు స్టైల్‌గా ఉండే అధునాతనమైన ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్లీక్ క్రోమ్ గార్నిష్‌తో కూడిన కొత్త అధునాతనమైన ఎల్ఇడి ఫ్రంట్ ఫాగ్ ల్యాంపులు మరియు విశాలంగా కనిపించేందుకు రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ లోయర్ గ్రిల్ ఉన్నాయి. కొత్తగా డిజైన్ చేసిన హెడ్ల్యాంపులు, వాటితో పాటు ఫ్రంట్ ఫాగ్ ల్యాంపులు, రాత్రి వేళ ల్యాంప్‌లు ఆన్ చేసినప్పుడు కారు ఫ్రంట్ భాగానికి ఒక సజాతీయ రూపాకారాన్ని అందిస్తాయి.
ఈ కొత్త, విలక్షణమైన, విభిన్నమైన ఎరుపు కాంతితో కూడిన ప్రీమియం C-ఆకారపుLED రియర్ కాంబినేషన్ ల్యాంపులు, ప్రీమియం క్రోమ్ గార్నిష్ మరియు రిఫ్లెక్టర్లతో కూడిన రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్ న్యూ అమేజ్ వెనుక భాగానికి ఒక అచ్చెరువొందించే రూపాన్ని ఇస్తాయి.ఈ నవీకరించిన మోడల్లో కొత్త డైమండ్-కట్ టూ-టోన్ మల్టీ-స్పోక్ R15ఎల్లాయ్ వీల్స్ మరియు టచ్ సెన్సర్ ఆధారిత స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ కలిగిన కొత్త క్రోమ్ డోర్ హ్యాండిల్స్, కార్ యొక్క వెలుపలి రూపసౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపజేస్తుంది.
న్యూ అమేజ్‌లో క్యాబిన్, ఇందులోని అద్భుతమైన ఇంటీరియర్ల కారణంగా ఠీవికి, దర్పానికి, విలాసానికి నిలువెత్తు ప్రమాణంగా ఉంటుంది. దీనిలో ప్రీమియం మరియు అత్యధిక కాంట్రాస్ట్ భావనను ప్రస్ఫుటంగా చూపేందుకు సమర్ధవంతంగా అమర్చబడిన కాక్పిట్లోడాష్ బోర్డు మరియు డోర్ ట్రిమ్‌ల పైన శాటిన్ సిల్వర్ ఆర్నమెంటేషన్ కలిగిన ఘనమైన ఇంటీరియర్లతో, స్టీరింగ్ చక్రం మీద శాటిన్ సిల్వర్ గార్నిష్ మరియు క్రోమ్ ప్లేట్ చేయబడిన ఎసి వెంట్ నాబ్‌లతో న్యూ అమేజ్ ఆహ్లాదకరమైన ప్లేని ఆఫర్ చేస్తుంది. కొత్త కుట్టు ప్యాటర్న్‌లో ప్రీమియం తోలు సీట్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ షిఫ్ట్ లివర్ కోసం తోలు బూటు మరియు ట్రంక్ మూత లైనింగ్ స్పర్శ మరియు భావన నాణ్యతను పెంపొందిస్తాయి. సౌకర్యవంతమైన మరియు విశాలమైన ఇంటీరియర్లతోపాటు కావలసినంత లెగ్‌రూమ్ కల్పించేందుకు అనువైన విశాలమైన క్యాబిన్, బకెట్ ఆకారం కలిగిన సీట్లు,డోర్ ట్రిమ్‌ల పై ఫ్యాబ్రిక్ ప్యాడ్ మరియు కొత్త ఫ్రంట్ మ్యాప్ ల్యాంప్లభిస్తాయి. వన్-పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, F1నుండి స్ఫూర్తి పొందిన స్పోర్టీగా ఉండే ప్యాడిల్ షిఫ్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి అత్యధిక ఫంక్షనాలిటీ ఫీచర్లు ఇందులో పుష్కలంగా లభిస్తున్నాయి.
హోండా వారి ప్రతిష్ఠాత్మకమైన 1.2L i-VTEC పెట్రోల్ ఇంజన్ మరియు 1.5L i-DTEC డీజిల్ ఇంజన్ల మాన్యువల్ మరియు సివిటి (నిరంతరం మారుతూండే ట్రాన్స్మిషన్)లు రెండింటితో సశక్తమైనది హోండా అమేజ్. ఔట్పుట్ మరియు సామర్ధ్యం కోసం అధునాతనమైన స్వల్ప రాపిడి సాంకేతికపరిజ్ఞానాలు కలిగిన పెట్రోల్ ఇంజన్ 90పిఎస్ శక్తిని, ఎంటి మరియు సివిటిలు రెండింటిలోనూ 6000 ఆర్పిఎంల చొప్పున అందిస్తుంది. డీజిల్ ఇంజన్‌ను ఎక్కువ శుద్ధీకరణతో అధిక శక్తిని సాధించేందుకు డీజిల్ ఇంజన్‌ను అభివృద్ధి చేయటం జరిగింది. ఇది గరిష్టంగా 100పిఎస్ శక్తిని ఎంటిలోనూ మరియు సివిటి వేరియంట్లలో 3600 ఆర్పిఎంకు 80 పిఎస్ గరిష్టంగా అందిస్తుంది. పెట్రోలు మరియు డీజిల్ ఇంజన్లు రెండింటిలోనూ సివిటి లభ్యత అనే సౌకర్యం, డ్రైవింగ్‌లో గొప్ప ఆనందాన్ని, అత్యుత్తమ ఇంధన సామర్ధఅయాన్ని అందిస్తుంది. హోండా డీజిల్ అధిక టార్క్ మరియు సివిటి యొక్క లీనియర్ యాక్సిలరేషన్ల సమ్మేనం, మృదువైన మరియు ప్రతిస్పందించే యాక్సిలరేషన్ ఇస్తుంది.