Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల ఏర్పాటుకు ఆసక్తి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ, ఈపీఎఫ్ఒ సంస్థలు స్టార్టప్‌లకు ఆర్థిక మద్దతును అందించనున్నాయి. ఈ రెండు సంస్థలు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ద్వారా కొత్త సంస్థలకు సాయంగా నిలువనున్నాయని పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) అడిషనల్ సెక్రెటరీ అనిల్ అగర్వాల్ తెలిపారు. స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు స్మాల్ ఇండిస్టీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బీ) ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్థి చేయనుందన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అధ్యక్షతన జరిగిన నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయన్నారు. దేశంలో స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకోనుందన్నారు. ఇందుకోసం 16 కీలక అంశాలను గుర్తించామన్నారు. దేశంలో కేవలం 6,000 మంది ఏంజెల్ ఇన్వెస్టర్లు ఉండగా, అమెరికాలో మూడు లక్షల మంది ఉన్నారని తెలిపారు. గ్రామ స్థాయికి స్టార్టప్ చాంపీయన్ ప్రోగ్రామ్‌ను ప్రభావవంతంగా చేర్చే దానిపై దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లోని స్టార్టప్‌లకు మద్దతు లభించాల్సిన అవసరం ఉందన్నారు.