Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో పండగ సీజన్ ప్రారంభం కావడంతో వాహన కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటాపోటీగా నూతన టెక్నాలజీతో కూడిన కొత్త మోడళ్లపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎంజీ మోటర్స్ బుధవారం తన ఆస్టర్ ఫీచర్లను ప్రకటించింది. ఈ కంపెనీ ఈసారి భారత మార్కెట్‌కు తగ్గట్టుగా ఎస్టర్ పేరుతో ఎంట్రీ లెవల్ ఎస్యూవీసీని ఆవిష్కరిస్తోంది. తక్కువ ధర అయినప్పటికీ ఫీచర్ల విషయంలో అద్బుతమని ఆ సంస్థ పేర్కొంది. డ్రైవర్ అసిస్టెంట్‌లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైట్ డిపాచర్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, ఇంటిలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ వంటి ఫీచర్లు దీని సొంతమని పేర్కొంది.