Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: విద్యార్థులకు వారి కెరీర్ లోని పెద్ద కలలలో ఒకటి సాధించుటకు సహాయపడేందుకు, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్ లో నేషనల్ లీడర్, డిజిటల్ లెర్నింగ్ లో లీడర్ BYJU’S తో కలిసి, ఇండియాలో అతి పెద్ద ఆల్-ఇండియా NEET మాక్ టెస్ట్ 2021ను ప్రకటించింది, ఈ టెస్ట్ ఆన్ లైన్ లో ఆగస్ట్ 22, 29 మరియు సెప్టెంబర్ 05, 2021 తేదీలలో నిర్వహించబడుతుది. ఈ మాక్ టెస్ట్ కు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయినది మరియు దీనికి ఎలాంటి రుసుము లేదు (ఉచితం). అంత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష కొరకు అత్యధిక ఆత్మవిశ్వాసం సంపాదించుకొనుటకు, ఆన్ లైన్ మాక్ టెస్ట్ ను రివైజ్డ్ NEET ప్యాటర్న్ లైనులో తయారు చేయుట జరిగింది. ప్రతి పేపరు 3 గంటలు కాలవ్యవధి కి ఉండి, పరీక్షార్థులకు ఒక రియల్ ఎగ్జమినేషన్ ఫీల్ కలగజేస్తుంది. ఈ టెస్ట్ పేపర్లు అనుభవజ్ఞులైన ఆకాష్ ఎక్స్ పర్ట్స్ ద్వారా ప్లాన్ చేయబడినవి మరియు దీనిలో పాల్గొనే విద్యార్థులకు, దేశం మొత్తం మీద పాల్గొనే పరీక్షార్థులు అందరితో పోటీలో తమ పెర్ఫార్మన్స్ కి బెంచ్ మార్క్ గా ఒక ఆల్-ఇండియా ర్యాంక్ లభిస్తుంది. రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత, NEET పరీక్షార్థులకు తమ బలహీన విషయాలు ఏమిటో గుర్తు పెట్టుకుని, మెరుగు పడేందుకు ఆకాష్ టీమ్ ఒక వివరణాత్మక రిపోర్ట్ అందిస్తుంది.
ఈ పరీక్ష తర్వాత, స్టూడెంట్స్ కు కాన్సెప్ట్ మరియు థీరీల గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగించే విధంగా, ఈ టెస్ట్ పేపర్ల గురించి ఒక లోతైన వీడియో సొల్యుషన్ అందించ బడుతుంది. ఈ మాక్ టెస్ట్ కు రిజిస్టర్ చేసుకోవాలని కోరుకునే NEET పరీక్షార్థులు, క్రింది లింక్ పై క్లిక్ చేసి అలా చేయవచ్చు. https://aakashdigital.com/mock/neet-test
ఆల్-ఇండియా మాక్ టెస్ట్ ఫార్ NEET 2021 ను గురించి మాట్లాడుతూ, శ్రీ ఆకాష్ చౌధరి, మేనేజింగ్ డైరెక్టర్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) ఇలా అన్నారు, “ మా విధానం ‘విద్యార్థులు మొదట ’ ను గౌరవిస్తూ , మేము ఇండియాలోకెల్లా అతి పెద్ద ఆన్ లైన్ ఆల్-ఇండియా NEET మాక్ టెస్ట్ 2021 నిర్వహిస్తూ ఉన్నాము. మరింత ఎక్కువ మంది విద్యార్థులకు తమ కలలు సాకారం చేసుకునేందుకు వీలుగా మేము దీని రిజిస్ట్రేషన్ ను ఉచితంగా ఉంచామ., ఫైనల్ పరీక్షలో పరీక్షార్థులు తమ నెర్వస్నెస్ ను కంట్రోల్ చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ మాక్ టెస్ట్ విద్యార్థులకు రియల్ టైమ్ NEET 2021 టెస్టింగ్ అనుభవం అందజేస్తుంది, ఇంకా వారు తమ ప్రిపరేషన్ ను పెంచుకొనుటకు మరియు తక్షణమే శ్రద్ధ చూపవలసిన విషయాలపై మనసు పెట్టి, పనిచేయుటకు ఇది వారికి సహాయం చేస్తుంది. ఇంకా ఇది వారికి యాంక్జైటీస్ మరియు స్ట్రెస్ ను వదులుకుని ప్రశాంతంగా పరీశ్ర రాసేందుకు కూడా సహాయ పడుతుంది.”