Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రీమియం గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోల్డబల్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ , మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ ను ముందుగా కొనుగోలు చేయాలని భావించే వినియోగదారుల కోసం అత్యద్భుతమైన ఆఫర్లను శాంసంగ్ ఇండియా విడుదల చేసింది. ఆగస్టు 24 నుంచి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ను 1,42,999 రూపాయలకు, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3ను 77,999 రూపాయలకు పరిచయ ఆఫర్లతో వినియోగదారులు ముందుగా బుక్ చేసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా అనతగ్గ ఫీచర్లను ఇవి కలిగి ఉన్నాయి. వీటిలో మొట్టమొదటి సారిగా అండర్ డిస్ప్లే కెమెరా, ఫోల్డబల్ ఉపకరణంపై ఎస్ పెన్, ఐపీ రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్ వంటివి ఉన్నాయి. శాంసంగ్ యొక్క ఫోల్డబల్ ఉపకరణాలు విప్లవాత్మక సాంకేతికత, సాటిలేని శైలి కి ఖచ్చితమైన సమ్మేళనంగా ఉంటుంది.
ప్రతిష్టాత్మక గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ స్మార్ట్ఫోన్లకు ప్రచారకర్తగా యూత్ ఐకాన్ అలియా భట్‌ను శాంసంగ్ ఎంపిక చేసింది. డిజిటల్, ఔట్‌డోర్ ప్రచారాలలో అలియాభట్ కనిపించడంతో పాటుగా వ్యక్తిగత జీవనశైలికి నూతన బెంచ్‌మార్క్స్‌ను ఏర్పాటుచేసే డిజైన్, సాంకేతికతను కలిగిన ఈ నూతన ఫ్లాగ్షిప్స్ను ప్రచారం చేయనున్నారు.
ధర మరియు లభ్యత
నూత్నమైన ఫోల్డబల్ అనుభవాలను మరింత మంది వినియోగదారులు పొందేందుకు తగిన అవకాశాలను శాంసంగ్ అందించడానికి కట్టుబడి ఉంది. ఈ కారణం చేతనే ఈ రెండు గెలాక్సీ జెడ్ ఉపకరణాలను అత్యంత ఆకర్షణీయమైన ధరలో శాంసంగ్ అందిస్తుంది.
- గెలాక్సీ ఫోల్డ్ 3 5జీ (12+256 జీబీ): 1,49,999 రూపాయలు (ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ గ్రీన్)
- గెలాక్సీ ఫోల్డ్ 3 5జీ (12+512 జీబీ) : 1,57,999 రూపాయలు (ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ గ్రీన్)
- గెలాక్సీ ఫ్లిప్ 3 5జీ (8+128జీబీ): 84,999 రూపాయలు (ఫాంటమ్ బ్లాక్ మరియు క్రీమ్)
- గెలాక్సీ ఫ్లిప్ 3 5జీ (8+256 జీబీ): 88,999 రూపాయలు (ఫాంటమ్ బ్లాక్ మరియు క్రీమ్)
పరిచయ ఆఫర్లు
గెలాక్సీ ఫోల్డ్ 3 5జీ మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీ స్మార్ట్ఫోన్లను ముందస్తుగా బుక్ చేసుకున్న వినియోగదారులు 7వేల రూపాయల విలువ వరకూ కలిగిన అప్‌గ్రేడ్ వోచర్ లేదా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యాష్ బ్యాక్ ను 7000 రూపాయల వరకూ, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేసిన ఎడల పొందవచ్చు. వీటితో పాటుగా, వినియోగదారులు ఒకసంవత్సరం పాటుగా 7999 రూపాయల విలువ కలిగిన ఉచిత శాంసంగ్ కేర్+ యాక్సిడెంటల్ మరియు లిక్విడ్ డ్యామేజీ భద్రతను గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ ప్రీ బుకింగ్‌పై మరియు గెలాక్సీ జెడ్ ఫ్లిప్3 5జీ పై 4799 రూపాయల విలువ కలిగిన శాంసంగ్ కేర్ ను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు, ఇప్పటికే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 5జీ మరియు /లేదా గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 5జీని భారతదేశంలో బుక్ చేసుకున్న వినియోగదారులు ఈ ఆఫర్లతో పాటుగా గెలాక్సీ స్మార్ట్ ట్యాగ్ సైతం పొందగలరు.